సీనియర్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) కారుకి యాక్సిడెంట్ అయ్యిందా? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆమె కారు ముంబైలోని ఒక బస్సును ఢీ కొట్టినట్టు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే… ఐశ్వర్య రాయ్ కారు ఒక బస్సును ఢీ కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఐశ్వర్య రాయ్ కారు డ్రైవర్, అలాగే ఆమె బాడీ గార్డు.. కారు నుండి కిందకి దిగి.. ఆ పరిసరాలను పరిశీలిస్తూ హడావిడి చేసినట్లు ఆ వీడియో ద్వారా స్పష్టమవుతుంది.
ఐతే ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) మాత్రం కిందకు దిగలేదు. ఆమె కారులో ఉన్నట్లు కూడా క్లారిటీ లేదు. కానీ బాడీ గార్డు కూడా ఉన్నాడు కాబట్టి.. ఆమె కారు లోపల ఉండే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. కారుకి, బస్సుకు డ్యామేజ్ ఏమీ జరగలేదు. ముంబై ట్రాఫిక్ లో భాగంగా ఇలాంటి చిన్న చిన్న డాష్ లు పడటం కామన్ అనే అభిప్రాయాలూ వినిపించాయి.ఐశ్వర్య రాయ్ కార్ల నెంబర్లు అన్నీ 5050 అనే నెంబర్ తోనే ఉంటాయి.
అందుకే అది ఐశ్వర్య రాయ్ కారు అని అంతా కనిపెట్టారు. అది ఐశ్వర్య లక్కీ నెంబర్ అని కూడా చాలా మంది అంటుంటారు. మొన్నటికి మొన్న సోనూసూద్ (Sonu Sood) భార్య సోనాలి సూద్ భార్య కారుకి కూడా చిన్నపాటి యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ కారుకి ఇలా అవ్వడం గమనార్హం. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఐశ్వర్య రాయ్ ‘పీఎస్ 1’ (Ponniyin Selvan) (పొన్నియన్ సెల్వన్ 1) ‘పీఎస్ 2’ (Ponniyin Selvan 2) (పొన్నియన్ సెల్వన్ 2) వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మరో సినిమాలో ఆమె కనిపించింది లేదు.