బిగ్ బాస్ హౌస్ లో ర్యాంకింగ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎవిక్షన్ ఫ్రీపాస్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ( Bigg Boss Telugu ) ఈ టాస్క్ లో భాగంగా ర్యాంకింగ్ లో బోటమ్ లో ఉన్న ఐదుగురు ఇందులో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. కంటెండర్స్ గా మారిన ఐదుగురు పూల్ పజిల్ అనే టాస్క్ లో పార్టిసిపేట్ చేశారు. స్మిమ్మింగ్ పూల్ ఉన్న తాళాలని గేలం సహాయంతో తీసి వారికి కేటాయించిన రంగుల బ్లాక్స్ తో పజిల్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
కీ తీసిన తర్వాత అక్కడున్న బ్లాక్స్ ని స్టండీపై అమరుస్తూ “EVICTION FREE PASS” అని వచ్చే విధంగా పేర్చాలి. ఇందులో ఫస్ట్ అశ్విని స్పీడ్ గా చేసింది గంట కూడా కొట్టింది కానీ, అందులో చాలా తప్పులు ఉన్నాయి. అలాగే మిగతా వాళ్లు కూడా పేర్చి గంట కొట్టారు. అందులో కూడా బ్లాక్స్ పేర్చడంలో తప్పులు పడ్డాడు సంచాలక్ శివాజీ. లాస్ట్ బిఫోర్ అర్జున్ కొట్టిన తర్వాత అతడిది చూస్తే ఒకే ఒక తప్పు అంటే అందరికంటే ఇదే తక్కువ అన్నమాట.
అందుకే అర్జుని విన్నర్ గా శివాజీ ప్రకటించాడు. దీంతో అర్జున్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని సొంతం చేసుకుని బిగ్ బాస్ కి థ్యాంక్స్ చెప్పాడు. కానీ, అనుకున్నంత ఈజీగా బిగ్ బాస్ ఏది ఇవ్వడు కదా, ఇందులో ఫిట్టింగ్ పెట్టాడు. ఈ పాస్ ని మీరు డిపెండ్ చేస్కోవాల్సి ఉంటుంది. ఇలా డిపెండ్ చేస్కుంటేనే మీకు పాస్ వస్తుందని ఖచ్చితంగా చెప్పాడు. దీంతో మిగతా హౌస్ మేట్స్ కూడా మరోసారి అవకాసం దక్కినట్లుగా అయ్యింది. ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని ఎలా డిపెండ్ చేస్కోవాలంటే.,
వేరేవాళ్లతో ఛాలెంజస్ ఆడుతూ అందులో గెలవాలి. అప్పుడే ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాళ్ల దగ్గరే ఉంటుంది. లేదంటే మాత్రం చేతులు మారుతుంది. ఇప్పుడు దీనిని ఆడియన్స్ అందరూ అన్యాయం అని అంటున్నారు. ఇలా చేతులు మారుతుంటే ఈజీ చాలెంజస్ పెట్టి బిగ్ బాస్ వారికి కావాల్సిన వారిని కాపాడుకుంటాడని అందుకే బిగ్ బాస్ ప్లాన్ అని నెటిజన్స్ – బిగ్ బాస్ ఆడియన్స్ మండి పడుతున్నారు. బోటమ్ 5లో ఉన్నవారే ఎలిజిబుల్ అని చెప్పి,
ఉల్టా పుల్టాగా ఇలా గేమ్స్ ఆడించడం కరెక్ట్ కాదని అందరూ అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి అర్జున్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచినా కూడా లాభం లేకుండా పోయింది. ఆ తర్వాత యావర్ అర్జున్ తో గేమ్ ఆడి దీనిని దక్కించుకున్నాడు. యావర్ పల్లవి ప్రసాంత్ తో , శోబాశెట్టితో గేమ్ ఆడి ఇద్దరినీ ఓడించి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని సొంతం చేస్కున్నట్లుగా సమాచారం. మరి ఇది తాత్కాలికంగా ఉంచుతాడా లేదా గేమ్ ప్లాన్ అంటూ బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) మాళ్లీ మారుస్తాడా అనేది తెలియాల్సి ఉంది. అదీ మేటర్.