సూపర్ స్టార్ మహేష్ బాబుకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అందుకే ఓవర్సీస్ లో మహేష్ సినిమాలు భారీ కలక్షన్స్ రాబడుతుంటాయి. ఆ విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని భరత్ అనే నేను సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు పూర్తి చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ 45 దేశాల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కలిపి 50 లొకేషనల్లో ఈ చిత్రం ప్రదర్శితం కానుంది.
యూకేలో 28 లొకేషన్లు, కెనడాలో 8, సింగపూలో 4, 18 యూరప్ దేశాల్లో కలిపి 36 లొకేషన్లు, 11 ఆఫ్రికన్ దేశాల్లో కలిపి 26, ఫిలిప్పైన్ లో 4, హాంగ్ కాంగ్లో 1, మలేషియాలో 7, థాయిలాండ్ లో 1, సూడాన్ లో 1, గల్ఫ్ దేశాల్లో 34 లొకేషన్లలో విడుదలకానుంది. విదేశాల్లో ఇన్ని లొకేషన్లలో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ భారీస్థాయి షోల వలన రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ వస్తాయి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మించిన ఈ సినిమా రికార్డులను తిరగరాయనుంది.