ప్రభాస్ పై కోప్పడ్డ హీరోయిన్
- February 28, 2017 / 10:01 AM ISTByFilmy Focus
ఆరడుగుల ఆజానుబాహుడు ప్రభాస్ ని ఇష్టపడని అమ్మాయి అంటూ ఉండరు. ఈ మిస్టర్ పర్ఫెక్ట్ ఎప్పుడూ నవ్వుతూ యువతుల కలల రాకుమారుడు అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోయిన్లు మాత్రమే కాదు బాలీవుడ్ తారలు సైతం డార్లింగ్ తో నటించాలని ఆశపడుతుంటారు. అటువంటిది ఓ ముద్దుగుమ్మ ప్రభాస్ తో గొడవకు దిగింది. మాట్లాడటం మానేసింది. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది నిజమే. అయితే ఇప్పటి మాట కాదు. పూరి జగన్నాథ్ ఏక్ నిరంజన్ సినిమా తీసే సమయంలోనిది. అందులో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ సుందరి కంగనా రనౌత్ నటించింది.
ఆ చిత్ర షూటింగ్ సమయంలో ప్రభాస్ కి కంగనాకు మధ్య చిన్న గొడవ జరిగిందంట. అప్పటి నుంచి ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. ఎడమొహం పెడమొహంగానే చిత్రాన్ని కంప్లీట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభాస్ తో కంగనా మాట్లాడలేదు. ఈ విషయాన్నీ స్వయంగా ఆ భామే ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది. ఇంతకీ గొడవ ఎందుకు వచ్చిందో చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు. మొత్తానికి ప్రభాస్ ద్వేషించే హీరోయిన్ గా కంగనా సినీ చరిత్రలో నిలిచిపోయిందన్న మాట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















