ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ‘హను – మాన్’ సినిమా ఈరోజు అనగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే నిన్న సాయంత్రం నుండే ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన వాళ్లంతా.. యునానిమస్ గా పాజిటివ్ టాక్ చెబుతున్నారు. చిన్న సినిమాగా వచ్చిన ‘హను-మాన్’.. ‘గుంటూరు కారం’ ‘సైంధవ్’ ‘నా సామి రంగ’ వంటి పెద్ద సినిమాల పక్కన ఎక్కడ నలిగిపోతుందో అని అంతా అనుకున్నారు. కానీ ‘గుంటూరు కారం’ కి మిక్స్డ్ టాక్ రావడం, ‘సైంధవ్’ ‘నా సామి రంగ’..ల పై పెద్దగా బజ్ లేకపోవడం అనేది ‘హను – మాన్’ గా బాగా కలిసొచ్చింది.
ఈ సంక్రాంతికి ‘హనుమాన్’ డామినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎక్కువగానే ఉండబోతుంది. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘హను -మాన్’ సినిమాని దర్శకుడు ప్రశాంత్ వర్మ తీర్చిదిద్దిన విధానం ప్రశంసనీయం.ఎందుకంటే అతి తక్కువ బడ్జెట్ లో విజువల్స్ చాలా అద్భుతంగా వచ్చేలా, ఓ హాలీవుడ్ సినిమాని తలపించేలా.. తెరకెక్కించాడు. హిందీలో కూడా ప్రశాంత్ కి మంచి పేరు వస్తుంది. కాబట్టి జై హనుమాన్ కి అక్కడ మంచి మార్కెట్ ఏర్పడే ఛాన్స్ వచ్చింది.
సో ప్రశాంత్ వర్మ అక్కడ స్టార్ అయ్యే ఛాన్స్.. లు ఉన్నాయి. ఇదే ఏడాది టాలీవుడ్ నుండీ (Nag Ashwin) నాగ్ అశ్విన్ కూడా హిందీలో అడుగు పెట్టబోతున్నాడు. ప్రస్తుతం కల్కి 2898 తో నార్త్ లో అడుగుపెడుతున్నాడు. ఆ సినిమా కూడా విజువల్ వండర్ గా తెరకెక్కుతుంది. గ్లింప్స్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉంది. సో ప్రశాంత్ వర్మ తర్వాత నాగీ కూడా ఈ 2024 లో నార్త్ లో సత్తా చాటే ఛాన్స్..లు ఉన్నాయి అని ఇండస్ట్రీ అభిప్రాయ పడుతుంది.