ప్రముఖ దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదైంది. తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ లో ఓ గుర్రం పెటా నిర్వాహకులు అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో గుర్రం యజమాని, మణిరత్నంలపై కేసు పెట్టారు. దీంతో పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత నెలలో హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్ పూర్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో గత నెల ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా షూటింగ్ జరిగింది.
ఓ భారీ యుద్ధం సీన్ కోసం ఏకధాటిగా షూటింగ్ నిర్వహించడంతో డీహైడ్రేషన్ తో ఓ గుర్రం చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పెటా ప్రతినిధులు పోలీసులు ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు మణిరత్నంతో పాటు సినిమా నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్, గుర్రం యజమానిపై పిసిఎ చట్టం 1960, సెక్షన్ 11, సెక్షన్ 429 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుర్రం చనిపోయిన విషయాన్ని బయటకు రానివ్వకుండా సైలెంట్ గా పూడ్చేశారు.
కానీ ఆనోటా ఈనోటా గుర్రం మృత్యువాత పడ్డ విషయం పెటా ప్రతినిధులకు తెలిసింది. దీంతో కేసు నమోదు చేశారు. మరి దీనిపై మణిరత్నం అండ్ కో ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ఇక ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో విక్రమ్, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, కార్తీ లాంటి టాలెంటెడ్ నటులు కనిపించనున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.