టాలీవుడ్ ఇండస్ట్రీలోని సక్సెస్ ఫుల్ హీరోలలో చిరంజీవి, బాలయ్య, నాని ముందువరసలో ఉంటారు. ఈ హీరోలకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అనుష్క, మృణాల్ ఠాకూర్, ఐశ్వర్యారాయ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం అందుతోంది. బాలయ్య విషయానికి వస్తే బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.
భగవంత్ కేసరి సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. న్యాచురల్ స్టార్ నాని విషయానికి వస్తే నాని హాయ్ నాన్న సినిమాతో బిజీగా ఉన్నారు. హాయ్ నాన్న సినిమా క్లాస్ ప్రేక్షకులతో పాటు మాస్ ప్రేక్షకులను సైతం మెప్పించేలా ఉండనుందని తెలుస్తోంది.
అయితే ఈ హీరోలు నటించిన సినిమాలలో ఒకే సంవత్సరం ఒకేరోజు రెండు సినిమాలు రిలీజయ్యాయి. ఈ జనరేషన్ లో ఈ ముగ్గురు హీరోలకు మాత్రమే ఈ రికార్డ్ సాధ్యమైందని చెప్పవచ్చు. 1980 సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీన చిరంజీవి నటించిన కాళి, తాతయ్య ప్రేమలీలలు సినిమాలు విడుదలయ్యాయి. చిరంజీవి నటించిన టింగు రంగడు, పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలు 1982 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన విడుదలయ్యాయి.
బాలయ్య (Balakrishna) నటించిన బంగారు బుల్లోడు, నిప్పు రవ్వ సినిమాలు 1993 సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీన విడుదలయ్యాయి. నాని నటించిన జెండా పై కపిరాజు, ఎవడే సుబ్రమణ్యం సినిమాలు 2015 సంవత్సరం మార్చి 21వ తేదీన విడుదలయ్యాయి. సీనియర్ హీరోలలో కొంతమంది నటించిన సినిమాలు సైతం ఈ విధంగా విడుదలయ్యాయి.