కెరీర్ తొలినాళ్లలోనే రాజమౌళి భారీ బడ్జెట్ తో గ్రాఫిక్స్ తో కూడిన సినిమాలను తెరకెక్కించాలని భావించినా బడ్జెట్ పరిమితుల దృష్ట్యా మొదట మాస్ కథలతో సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మగధీర సినిమా నుంచి రూటు మార్చిన జక్కన్న కేవలం 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆ సినిమాను తెరకెక్కించి సక్సెస్ సాధించారు. ఆ తరువాత ఈగ సినిమా తీసి ఆ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు.
మగధీర, ఈగ సినిమాలు ఆ స్థాయిలో సక్సెస్ సాధించడానికి విజువల్ ఎఫెక్ట్స్ కూడా కారణమని చెప్పవచ్చు. బాహుబలి సిరీస్ లో భారీ సెట్టింగ్స్, యాక్షన్ సీన్స్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యత ఉండటం వల్లే ఇతర దేశాల్లో కూడా ఆ సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధించింది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ తొలి ప్రెస్ మీట్ లో బాహుబలి స్థాయిలో ఆర్ఆర్ఆర్ మూవీలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఉండదని ఆర్ఆర్ఆర్ సోషల్ మూవీ అని రాజమౌళి అన్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో చూసిన తర్వాత రాజమౌళి మాట మీద నిలబడలేదని అర్థమవుతోంది. బాహుబలిని మించి రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ విషయంలో విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యతనిచ్చారని తెలుస్తోంది. దీంతో విజువల్ ఎఫెక్ట్స్ రాజమౌళి బలహీనతగా మారిపోయిందని నెటిజన్లు కామెంట్లుచేస్తున్నారు. రాజమౌళి మహేష్ తో కూడా భారీ సినిమానే ప్లాన్ చేశారని తెలుస్తుండగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి.