తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందిన ‘హను-మాన్’ మూవీ ఈరోజు అంటే జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న అంటే జనవరి 11 న ఈ సినిమా ప్రీమియర్ షోలు చాలా చోట్ల పడ్డాయి. అన్నిటికి కూడా యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. దీంతో కలెక్షన్స్ అద్భుతంగా వస్తాయి అనే భరోసా అందరిలో ఏర్పడింది. దానికి తగ్గట్టుగా మొదటి వీకెండ్ ఒక రేంజ్లో కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ 5వ రోజు కూడా సూపర్ గా కలెక్ట్ చేసి డబుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయింది.
ఒకసారి 5 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం
12.27 cr
సీడెడ్
3.99 cr
ఉత్తరాంధ్ర
3.72 cr
ఈస్ట్
2.80 cr
వెస్ట్
1.71 cr
గుంటూరు
1.92 cr
కృష్ణా
1.52 cr
నెల్లూరు
0.90 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
28.83 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
5.56 cr
హిందీ
9.58 cr
ఓవర్సీస్
16.10 cr
వరల్డ్ వైడ్( టోటల్)
60.07 cr (షేర్)
‘హనుమాన్’ (Hanu Man) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.28.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ 5 రోజుల్లో రూ.60.07 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడమే కాకుండా ఇప్పటివరకు రూ.31.57 కోట్ల లాభాలను అందించింది