ఇటీవల ‘మన్మధుడు2’ ‘కిరాక్ పార్టీ’ హీరోయిన్ అయిన సంయుక్త హెగ్డే పై మూక దాడి జరిగిన సంగతి తెలిసిందే. సంయుక్త తన స్నేహితులతో కలిసి బెంగుళూరులోని అగరా లేక్ సమీపం వద్ద ఉన్న పార్కుకు వర్కౌట్లు చేసేందుకు వెళ్ళింది. అయితే ఆమె స్పోర్ట్స్ ఇన్నర్ వేసుకుని వెళ్లడం.. అలాగే తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ వంటివి చెయ్యడంతో దగ్గరలో ఉన్న కవితా రెడ్డి అనే మహిళ.. సంయుక్త మరియు ఆమె స్నేహితుల పై ‘మీరు చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు..
పబ్లిక్ తిరిగే ప్లేస్లో ఇలాంటి డ్రెస్ లు వేసుకురావడమేంటి’ అంటూ వాగ్వాదానికి దిగింది.కవితకు మద్దతు ఇస్తూ.. పక్కనున్న జనాలు కూడా సంయుక్త మరియు ఆమె స్నేహితుల పై మాటల యుద్దానికి దిగారు. అంతేకాదు ‘శాండిల్ వుడ్ డ్రగ్ రాకెట్ లో మిమ్మల్ని కూడా ఇరికిస్తాము జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు వీడియో తీసిన సంయుక్త… ‘ఇలాంటి జనాల పై కఠినచర్యలు తీసుకోవాలి’ అంటూ బెంగుళూర్ పోలీసులకు విన్నపించుకుంది..! ఈ విషయం పై తాజాగా కాజల్ అగర్వాల్ స్పందించి సంయుక్తకు మద్దతు పలికింది.
తన ట్విట్టర్ ద్వారా కాజల్ స్పందిస్తూ.. “సంయుక్తా.. ఇలా జరిగిందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. కవితా రెడ్డి గారు.. మీ కోపానికి గల కారణం ఏంటో ముందు తెలుసుకొని.. ఆ తరువాత దానిని పరిష్కరించుకోవడం నేర్చుకోండి. అమ్మాయిలు ఏం డ్రెస్ వేసుకోవాలో వాళ్ళకు తెలుసు. పక్కవాళ్ళ గురించి పట్టించుకోవడం మానేసి.. మన పని మనం చేసుకుంటే చాలా మంచిది” అంటూ మండిపడింది కాజల్.
Omg Sam! can’t believe this even happened! Miss Kavitha reddy,u need to deal with ur anger issues n figure out where this frustration/aggression comes from,a lot more than what young girls choose to wear, doing their own thing-high time we all mind our own affairs! #ThisIsWronghttps://t.co/clxoGE6eRC