సాధారణంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలయ్యే సినిమాలు ఇతర దేశాలలో కూడా విడుదలవుతూ ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. ఇలా అక్కడ కూడా తెలుగు సినిమాలు ఎంతో అద్భుతమైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటాయి విదేశాలలో ప్రసారమయ్యే సినిమాలు మంచి ఆదరణ రాబట్టాలని ఆ హీరోల అభిమానులు కూడా కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అమెరికాలో తెలుగు సినిమాలకు కూడా ఎంతో మంచి ఆదరణ ఉంటుంది అక్కడ విడుదలైనటువంటి సినిమాలు భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ ఉంటాయి.
ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు నటించిన సినిమాలన్నీ కూడా వన్ మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే అయితే ఇలా తమ సినిమాలకు వన్ మిలియన్ డాలర్ కలెక్షన్స్ రాబట్టినటువంటి హీరోలలో మొట్టమొదటి స్థానంలో మహేష్ బాబు ఉన్నారు. ఇప్పటివరకు మహేష్ బాబు నటించినటువంటి 11 సినిమాలు అక్కడ వన్ మిలియన్ డాలర్ కలెక్షన్లను సాధించాయి. అమెరికాలో వన్ మిలియన్ డాలర్ అంటే మన ఇండియన్ కరెన్సీ లో దాదాపు 8 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్టు అర్థం.
మహేష్ బాబు తర్వాత అలాంటి రికార్డ్ నేచురల్ స్టార్ నాని అందుకున్నారని తెలుస్తుంది. ఇప్పటివరకు నాని నటించిన ఎనిమిది సినిమాలు అమెరికాలో వన్ మిలియన్ డాలర్ కలెక్షన్స్ రాబట్టాయి తాజాగా హాయ్ నాన్న సినిమా కూడా వన్ మిలియన్ డాలర్ కలెక్షన్స్ సాధించాయి. ఇలా మహేష్ బాబు తర్వాత నాని ఈ అద్భుతమైనటువంటి రికార్డు సాధించారు
ఇక నాని (Nani) తర్వాత ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, చిరంజీవి, రామ్ చరణ్ వరుస స్థానాల్లో ఉన్నారు. ఇలా పాన్ ఇండియా స్టార్ హీరోలు అందరిని వెనక్కునేట్టి ఈ విషయంలో నాని రెండో స్థానంలో ఉండటంతో నాని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.