రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మంచికి కాకుండా చెడుకు వాడుకుంటున్నారు. ఈ విషయంలో ఎవరు ఎంత చెప్పినా తమ ‘టాలెంట్’ చూపిస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఈ క్రమంలో సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను మార్ఫ్ చేసి నెటిజన్లకు తప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. దీంతో సెలబ్రిటీలు కోర్టును ఆశ్రయిస్తున్నారు. తమ ఫొటోలు, వీడియోలను తమ అనుమతి లేకుండా వినియోగించకూడదు అని న్యాయస్థానాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు చిరంజీవి కూడా కోర్టుకెళ్లారు. […]