Pawan Kalyan,Anil Ravipudi: మరో క్రేజీ ప్రాజెక్ట్ కి దిల్ రాజు ప్లాన్!
- November 12, 2021 / 07:46 PM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘భీమ్లానాయక్’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ సినిమా తరువాత ‘హరిహర వీరమల్లు’ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నారు. అలానే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. అయితే ఇప్పుడు పవన్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ‘వకీల్ సాబ్’ సినిమా వచ్చింది.
ఆ సినిమా సమయంలోనే పవన్ తో మరో సినిమా చేయాలనుకున్నారు దిల్ రాజు. ఇప్పుడు దానికి తగ్గట్లుగా పావులు కదుపుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనీల్ రావిపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇటీవల పవన్ ను అనీల్ రావిపూడి కలిసినట్లు తెలుస్తోంది. కథ విషయంలో పవన్ ఓ కండీషన్ పెట్టారట. మాస్ సబ్జెక్ట్ కాకుండా.. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ అయితే బెటర్ అని చెప్పారట.

‘ఎఫ్2’ టైప్ లో కామెడీ ఉంటే బావుంటుందని.. అన్నీ సీరియస్ కథలే అయిపోతున్నాయని అన్నారట. దీంతో అనీల్ తన స్టైల్ లో కథ రాసుకునే పనిలో పడ్డారట. మరి పవన్ ని మెప్పించే స్థాయిలో కథను సిద్ధం చేయగలరో లేదో చూడాలి. ప్రస్తుతం అనీల్ రావిపూడి ‘ఎఫ్3’ సినిమాను రూపొందిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు.
పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
















