ఆర్ ఆర్ ఆర్ తరువాత చరణ్ దర్శకుడు అతడే, ఇది ఫిక్స్..!
- February 26, 2020 / 07:07 PM ISTByFilmy Focus
ఛలో చిత్రంతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన వెంకీ కుడుముల మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్నాడు. ఇక నితిన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ రిలీజ్ భీష్మ కూడా సూపర్ హిట్ వైపుగా దూసుకుపోతుంది. దీనితో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న దర్శకుడిగా ఆయన నిలిచాడు. ఈ నేపథ్యంలో ఆయన మరో బడా ఆఫర్ దక్కించుకున్నారు. ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీ చేసే అవకాశం దక్కించుకున్నారు. దాదాపు వీరి కాంబినేషన్ సెట్ అయ్యిందని తెలుస్తుంది.

భీష్మ చిత్రంలో ఓ పక్క రొమాంటిక్ లవ్ ట్రాక్ నడిపిస్తూనే ఆర్గానిక్ వ్యవసాయం అనే కాన్సెప్ట్ ని చక్కగా చెప్పిన వెంకీ కుడుముల టేకింగ్ నచ్చిన రామ్ చరణ్ అతని అవకాశం ఇచ్చాడట. దీనిపై కొద్దిరోజులలో అధికారిక ప్రకటన రానుంది. మూడో సినిమాకే రామ్ చరణ్ వంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే అదృష్టం దక్కించుకున్న వెంకీ కుడుముల అతని కోసం ఎలాంటి స్క్రిప్ట్ సిద్ధం చేస్తాడో చూడాలి మరి. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ షూటింగ్ లో రామ్ చరణ్ తో పాటు, ఎన్టీఆర్ మరియు అజయ్ దేవ్ గణ్ పాల్గొంటున్నారు. దర్శకుడు రాజమౌళి చరణ్ ని అల్లూరిగా ఎన్టీఆర్ ని కొమరం భీమ్ గా ఆర్ ఆర్ ఆర్ లో చూపించనున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది.
Most Recommended Video

















