పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్ల వల్ల వైసీపీ నాయకులు హర్ట్ అయ్యారనే సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. ఇండస్ట్రీలో అందరూ పవన్ తమ పాలిట గుదిబండ అయ్యారని భావిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పవన్ పాలిటిక్స్ లో రెండు గుర్రాలపై వెళ్లే వ్యక్తి అని సజ్జల చెప్పుకొచ్చారు. ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంలో నిర్మాతలు సంతోషంగా ఫీలవుతున్నారని సజ్జల వెల్లడించారు.
ఆన్ లైన్ విధానం వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు చేరాల్సిన మొత్తం చేరుతుందని సజ్జల పేర్కొన్నారు. వారం రోజుల్లో ఆన్ లైన్ టికెట్ల వ్యవస్థ గురించి విధివిధానాలు రానున్నాయని సజ్జల వెల్లడించారు. సినీ పెద్దలతో సమావేశం నిర్వహించడానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని సజ్జల చెప్పుకొచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బాహుబలి తొలివారం 50 శాతం టికెట్లు మాత్రమే బుక్ అయినట్లు చూపించారని ఈ అంశాన్ని ఒకసారి చెక్ చేయాలని సజ్జల పేర్కొన్నారు.
బాహుబలి తొలి వారం సగం టికెట్లు అమ్ముడైనట్టు చూపిస్తే మోసం చేసినట్టేనని సజ్జల వెల్లడించారు. సినిమా థియేటర్లు ఎవరి చేతిలో ఉన్నాయో అందరికీ తెలుసని సజ్జల వెల్లడించారు. బాహుబలి లెక్కలు బయటకు వస్తే ఆ సినిమాకు పన్నులు తక్కువగా చెల్లించి ఉంటే ఆ సినిమా నిర్మాతలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వైసీపీ నాయకులు కలెక్షన్ల లెక్కలను బయటకు తీస్తే పెద్ద హీరోలకు ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.