టాలీవుడ్ లో కమీడీయన్స్ హీరోలుగా మారడం, సహజమే…ఆనాటి మహానటులు రాజబాబు, పద్మనాభం, చలం దగ్గర నుంచి ఈనాటి, ఆలీ, బ్రహ్మానందం, సునీల్ వరకూ అందరూ కమీడీయన్స్ గా మొదలు పెట్టి హీరో పాత్రలు చేసిన వారే….అయితే అందులో కొందరు సక్సెస్ఫుల్ గా మారినా, మరికొందరు మాత్రం కామెడీ హీరోలుగా కొనసాగుతున్నారు….అదే క్రమంలో హీరో పాత్రపై ప్రేమతో కామెడీ పాత్రలు చేస్తున్న ప్రముఖ కమీడీయన్ సప్తగిరి ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ తో హీరోగా మారిపోయాడు. ఇక ఆయన హీరోగా తొలిసారి నటించిన సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యింది. శ్రీ సాయి సెల్యులాయిడ్ పతాకం పై మాస్టర్స్ హోమియో అధినేత డాక్టర్ రవికిరణ్ నిర్మించిన సప్తగికి ఎక్స్ ప్రెస్ సూపర్ హిట్ టాక్ తో తెలుగునాట దూసుకుపోతుంది.
దీంతో ఈ సినిమా రిలీజైన మూడు రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టిందని సప్తగిరి ఎక్స్ ప్రెస్ ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలానే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న విశేష ఆదరణ నేపథ్యంలో థియేటర్ల సంఖ్య 300 నుంచి 350కి పెంచినట్లుగా నిర్మాత రవికిరణ్ అధికారికంగా ప్రకటించారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, అసలు విషయం ఇక్కడే మొదలయింది ఈ సినిమా విషయంలో సప్తగిరి మీడియా సమక్షంలో కన్నీరు పెట్టుకున్నాడు, చాలా బాధపడ్డాడు…ఇంతకీ ఆయన బాధకు కారణం ఏంటి అంటే…ఓ వెబ్ సైట్ లో సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్రం గురించి తక్కువ చేసి రాయడమే అట, సప్తగిరి చాలా హర్ట్ అయ్యాడు అని అంటున్నాడు. నన్ను పర్సనల్ గా ఎందుకు టార్గెట్ చేసారని బాధపడ్డాడు . ప్రస్తుతం అన్నీ ఏరియాల్లో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోందని కనీసం ఈ న్యూస్ అయినా రాయండని కోరాడు సప్తగిరి. అయితే ఈ విషయం చూసి కొందరు ఇది పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టి పారేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.