సినిమా పరిశ్రమలో కంటెంట్ ఉన్న కథలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. కానీ ఆ కథలను తెరకెక్కించే దర్శకులు తక్కువ. అలాంటి దర్శకులలో ఒకరైన శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తన మార్క్ మేకింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మరోవైపు నేచురల్ స్టార్ నాని (Nani) కూడా తన కెరీర్‌లో కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ బేస్డ్ సినిమాలకు పెద్ద పీట వేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటి వరకు కొత్త, చిన్న దర్శకులతో మంచి సినిమాలు చేసిన నాని.. ఇప్పుడు శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇప్పటికే నాని తన లైన్ క్లియర్ చేసుకుంటూ ‘హిట్ 3’ (HIT 3) షూటింగ్‌ను పూర్తి చేసుకోవాలని చూస్తున్నాడు. అలాగే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఒదెలతో (Srikanth Odela) ‘ది ప్యారడైజ్’ అనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. అయితే వీటితో పాటు తమిళ దర్శకుడు సీబీ చక్రవర్తితో (Cibi Chakaravarthi) ఓ ప్రాజెక్ట్ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. కానీ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది మాత్రం శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్. గతంలోనూ ఈ కాంబోపై చర్చలు జరిగాయి కానీ, కథ విషయంలో అవి సెటిల్ కాలేదు. కానీ ఇప్పుడు మరోసారి నాని-కమ్ముల కాంబినేషన్పై బజ్ మొదలైంది.
కమ్ముల ఇప్పటివరకు తన సినిమాల్లో న్యాచురల్ ఎలిమెంట్స్‌ను చూపిస్తూ, తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను మెప్పించగలిగాడు. ఫిదా (Fidaa) , ఆనంద్ (Anand), హ్యాపీ డేస్ (Happy Days) లాంటి ఎమోషనల్ సినిమాలతో అందరికీ దగ్గరయ్యాడు. అయితే, లేటెస్ట్‌గా ఆయన ధనుష్‌తో (Dhanush) ‘కుబేర’ (Kubera) అనే పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత నాని ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది. ఇకపోతే నాని కెరీర్‌ను గమనిస్తే, అతను ఎప్పుడూ స్ట్రాంగ్ కథలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాడు. జెర్సీ (Jersey) , శ్యామ్ సింగ రాయ్ (Shyam Singha Roy), దసరా (Dasara) లాంటి కథలను ఎంచుకుని తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
ఇక శేఖర్ కమ్ముల కూడా గతంలో నాగ చైతన్యతో (Naga Chaitanya) లవ్ స్టోరీ (Love Story) చేశాడు. అయితే అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ ఇప్పుడు ధనుష్‌తో కుబేర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ తరువాత శేఖర్ కమ్ముల తదుపరి సినిమా పాన్ ఇండియా రేంజ్‌లోనే ఉండే అవకాశం ఉంది. నాని ప్రస్తుతం చేస్తున్న హిట్ 3, ప్యారడైజ్ సినిమాలు కూడా పాన్ ఇండియా టార్గెట్‌తోనే తెరకెక్కుతున్నాయి. కాబట్టి నాని-కమ్ముల కాంబో కుదిరితే, అది కూడా ఒక బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా మారనుంది.