మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ మరియు ఏ. రామస్వామి రెడ్డి నిర్మాతలుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా వస్తున్న సినిమా లైఫ్ (లవ్ యువర్ ఫాదర్). ఎస్. పి. చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా, సంధ్య ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా షూటింగ్ నేటితో పూర్తయింది. అతి త్వరలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ టీం మీడియాతో ముచ్చటించారు.
దర్శకుడు పవన్ కేతరాజు మాట్లాడుతూ : కొడుకు బాధ్యత తీర్చేందుకు తండ్రి పడే ఆరాటం తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం మా ఈ లైఫ్ సినిమా. కథ అంతా కాశి బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ శివతత్వాన్ని చూపించే చిన్న ప్రయత్నం చేశామన్నారు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటరటైనర్ సినిమాగా ఈ సినిమాని తీస్తున్నాం. హీరో శ్రీహర్ష మొదటి సినిమా అయినా చాలా బాగా నటించాడు. హీరో తండ్రి పాత్రలో ఎస్పి చరణ్ గారు ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యారు. రఘు బాబు గారు, షకలక శంకర్, ప్రవీణ్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. శ్యామ్ కె నాయుడు గారు సినిమాటోగ్రఫీ విజువల్ వండర్ లా ఉంటుంది. ఈ సినిమా విజువల్స్ ఇంత గ్రాండ్ గా ఉన్నాయంటే శ్యామ్ గారి వల్లే. అదేవిధంగా మణిశర్మ గారు ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అన్ని పాటలు చాలా మేలోడి గా ఇచ్చారు. క్లైమాక్స్ మరియు బిజియం కథ కి హైలైట్ . కషిక కపూర్ చాలా బాగా నటించింది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
కొరియోగ్రాఫర్ మోయిన్ మాట్లాడుతూ : ఈ సినిమాలో 5 సాంగ్స్ నేనే కొరియోగ్రఫీ చేశాను. నన్ను నమ్మి సింగిల్ కార్డ్ కొరియోగ్రఫీ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్స్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అని నమ్ముతున్నాను అన్నారు.
హీరోయిన్ కషిక కపూర్ మాట్లాడుతూ : ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్స్ కి కృతజ్ఞతలు. కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ గారు ప్రొడక్షన్ వైస్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. డైరెక్టర్ పవన్ చెప్పిన కథ చాలా బాగుంది. తండ్రికి కొడుకు కి మధ్యన అనుబంధాన్ని చాలా బాగా చూపిస్తున్నారు. ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
హీరో శ్రీహర్ష మాట్లాడుతూ : లైఫ్… తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని చూపించే ఒక మంచి సినిమా. ఈరోజు ఈ సినిమా షూటింగ్ లాస్ట్ డే. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
నిర్మాత అన్నపరెడ్డి రామస్వామి రెడ్డి మాట్లాడుతూ : ఆరు నెలల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాం. నేటితో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. డైరెక్టర్ పవన్ గారు, సినిమాటోగ్రఫీ శ్యామ్ గారు, మ్యూజిక్ మణిశర్మ గారు చాలా కష్టపడ్డారు. సినిమా ఎక్కువ శాతం కాశీలో షూట్ చేసాం. దైవత్వంతో పాటు తండ్రి కొడుకులు మధ్య ఉన్న బంధాన్ని కూడా చాలా బాగా చూపిస్తున్నాం. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఇష్టపడి నటించారు. మా మూవీ టీమ్ అందరికీ ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. త్వరలో ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని నమ్మకంతో ఉన్నాము అన్నారు.
టెక్నీషియన్స్ :
నిర్మాణం : మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్
నిర్మాతలు : కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ మరియు ఏ. రామస్వామి రెడ్డి
రచన, దర్శకత్వం: పవన్ కేతరాజు
సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు
సంగీతం : మణిశర్మ
యాక్షన్ : కార్తీక్ క్రౌడర్
ఎడిటర్ : ఆర్. కె
కొరియోగ్రఫీ : మోయిన్
ఆర్ట్ : చిడిపల్లి శంకర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
పి ఆర్ ఓ : మధు VR