తెలుగు కుర్రాడు టాలీవుడ్ కంటే బాలీవుడ్లో ఎక్కువగా రాణిస్తున్నాడు హర్షవర్ధన్ రాణే.. పక్కిండి అబ్బాయిలా కనిపించే ఈ హీరోకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హర్షకు సరైన పాత్ర ఒక్కటీ రాలేదు. కానీ బీ టౌన్లో మాత్రం డిఫరెంట్ రోల్స్తో ఆకట్టుకుంటున్నాడు. ముంబయి ప్రేక్షకులు హర్షకు బాగా కనెక్ట్ అయ్యారు. పలువురు హీరోయిన్లతో డేటింగ్ చేసిన హర్ష ప్లే బాయ్ ఇమేజ్ను దక్కించుకున్నాడు. గతంలో కిమ్ శర్మ, మీనాక్షి దాస్లతో పాటు మరికొందరు భామలతో ఈ హీరో ప్రేమాయణం సాగించాడు.
అయితే ఈ హ్యాండ్సమ్ కు సంబంధించి నెట్టింట ఓ రూమర్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఇతగాడు బాలీవుడ్ బ్యూటీ.. అది కూడా పెళ్లైన హీరోయిన్.. అందులోనూ ఓ కూతురు కూడా ఉన్న భామతో రిలేషన్షిప్లో ఉన్నాడట. ఇంతకీ ఆ భామ ఎవరంటే..? సంజీదా షేక్.. ఈ కువైట్ బ్యూటీ బీ టౌన్లో గత కొన్నేళ్ల క్రితం సెటిల్ అయింది. టీవీ ఇండస్ట్రీలో తన ప్రయాణం షురూ చేసి నెమ్మదిగా వెండితెర వైపు సాగించింది. తన కెరీర్ మొదట్లో తోటి నటుడు అమీర్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
అప్పట్లో ఈ జంట బీ టౌన్ టీవీ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. పవర్ కపుల్గా పేరు సంపాదించారు. ఈ ఇద్దరికి ఒక పాప కూడా పుట్టింది. కొన్నేళ్ల తర్వాత ఈ జంట మనస్పర్థలు రావడంతో 2021లో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి సంజీదా సింగిల్ మదర్గా లైఫ్ లీడ్ చేస్తోంది. అయితే తాజాగా హర్షవర్ధన్ రాణేతో సంజీదా రిలేషన్షిప్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ జంట ఇటీవలే విహార యాత్రకు కూడా వెళ్లారట. ఆ ఫొటోలు కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఈ కపుల్ జంటగా దిగిన ఫొటోలు కాదు అవి..
హర్షవర్ధన్ (Hero) షేర్ చేసిన ఫోటోలు, సంజీదా షేర్ చేసిన ఫోటోల బ్యాక్ గ్రౌండ్ రెండూ మ్యాచ్ అవ్వడంతో నెటిజన్స్ ఫోటోలను ట్రెండ్ చేస్తూ వార్తలు సృష్టిస్తున్నారు. ఈ జంట గతంలో ఓ సినిమాలో నటించింది. అప్పటి నుంచే వీరిమధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు టాక్. ఇక దీనిపై హర్షవర్ధన్ ను విలేకరులు ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి వార్తలు నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టవు.. ఇక జర్నలిస్టులకు వీక్లీ టార్గెట్లు ఉంటాయి కాబట్టి వారు ఇలాంటి కథనాలు రాయడం సహజం.. కాబట్టి నేను అసలు వీటిని పట్టించుకోను అంటూ హర్ష తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.