Trivikram: ఇప్పుడు ప్రభాస్ దర్శకుడితో త్రివిక్రమ్ వారసుడు!

టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన త్రివిక్రమ్ (Trivikram) తన విలక్షణమైన కథనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు, ఆయన వారసుడు కూడా సినీ రంగంలో తన అడుగులను సానుకూలంగా వేస్తున్నాడని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తండ్రి స్థాయికి తగ్గట్టుగా కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక శైలి సెట్ చేసుకోవాలని త్రివిక్రమ్ కుమారుడు భావిస్తున్నాడట. ఇప్పటికే పలు సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన త్రివిక్రమ్ కుమారుడు, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) VD12 (Kingdom)  ప్రాజెక్టులో తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నాడని ఫిల్మ్ యూనిట్ చెబుతోంది.

Trivikram

గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ సమయంలో, అతని వర్క్ ఎథిక్, క్రియేటివిటీ యూనిట్‌లోని అందరినీ ఆకట్టుకుందట. ఆ అనుభవంతోనే ఇప్పుడు మరొక బిగ్ ప్రాజెక్ట్‌లో ఎంటర్ అవ్వనున్నట్లు సమాచారం. లేటెస్ట్ బజ్ ప్రకారం, త్రివిక్రమ్ కుమారుడు, సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ (Prabhas)  స్పిరిట్  (Spirit)  ప్రాజెక్టులో అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అవుతున్నాడట. సాధారణంగా ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్‌లో కొత్త కుర్రాడికి అవకాశం రావడం అరుదు.

కానీ త్రివిక్రమ్ సపోర్ట్ తో కాకుండా, స్వయంగా తన ప్రతిభతో ఈ ఛాన్స్ దక్కించుకున్నట్లు టాక్. వంగా లాంటి ఇంటెన్స్ ఫిల్మ్ మేకర్‌తో పని చేయడం, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, యాక్షన్ మేకింగ్ లాంటి పలు అంశాల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందడంలో అతనికి పెద్ద అవకాశం అవుతుందని చెప్పవచ్చు. పరిశ్రమలో వినిపిస్తున్న మరో వార్త ఏమిటంటే, త్రివిక్రమ్ తనయుడు డైరెక్టర్‌గా పరిచయం అయ్యే రోజు దగ్గర్లో ఉందట.

మొదటి సినిమాగా ఒక స్టార్ వారసుడితోనే ఉంటుందని టాక్. ఇక త్రివిక్రమ్, ఆ హీరోకు మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈ ప్రాజెక్ట్‌కు బలాన్ని ఇస్తుందని చెబుతున్నారు. మొత్తానికి, త్రివిక్రమ్ కుమారుడు సాధారణ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోన్‌కు పరిమితం కాకుండా, వైల్డ్ కాన్సెప్ట్‌లతో సినిమాలు తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి దిగొచ్చిన విశ్వక్ సేన్.. సారీ చెబుతూ ఎమోషనల్ లెటర్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus