నటసింహ నందమూరి.. మాస్ ప్రేక్షకుల్లో ఆయనకుండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు.. 4 దశాబ్దాలకు పైగా నటరత్న ఎన్టీఆర్ నట వారసత్వాన్ని ఒంటి చేత్తో కొనసాగిస్తున్నారాయన.. తండ్రి తర్వాత జనరేషన్‌లో జానపద, పౌరాణిక పాత్రలు చేయాలంటే ఒక్క బాలయ్యకి మాత్రమే సాధ్యం. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన, చరిత్ర సృష్టించిన సినిమాలు చేశారు. రికార్డులు ఆయనకు కొత్త కాదు.. రికార్డులు సృష్టించాలన్నా, వాటిని బీట్ చేసి మళ్లీ చరిత్ర తిరగరాయాలన్నా అది తనకే వీలవుతుందని పలు సందర్భాల్లో రుజువు చేశారు.
6 పదుల వయసు దాటినా ఇప్పటి యువ హీరోలకు గట్టిపోటీనిస్తూ క్రేజీ ప్రాజెక్టులు లైన్‌లో పెడుతూ.. అరుదైన రికార్డులు నెలకొల్పుతూ.. పరిశ్రమ వారిని కూడా ఆశ్చర్యపరుస్తున్నారు. రీసెంట్‌గా మరో అరుదైన ఘనత సాధించారాయన.. బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘వీరసింహా రెడ్డి’ గా ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చారు.. యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సిస్టర్ సెంటిమెంట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.. తండ్రీ కొడుకులుగా బాలయ్య ద్విపాత్రాభినయం ఫ్యాన్స్‌కి సాలిడ్ ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చింది..
‘వీర సింహా రెడ్డి’ గా తన నటవిశ్వరూపాన్ని చూపించారు. ఎప్పటిలానే తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో థియేటర్లలో డైనమెట్స్ పేల్చారు. ఇక డ్యాన్సుల సంగతైతే చెప్పక్కర్లేదు. ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లో, అభిమానుల మనసుల్లో ఓ మెమరబుల్ మూవీగా మిగిలిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు..తెలుగు రాష్ట్రాల్లోని పల్లెటూళ్లల్లో కూడా వీక్ డేస్‌లోనూ డీసెంట్ ఫిగర్స్ రాబడుతున్న బాలయ్య సినిమా.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెయిన్ థియేటర్ సంధ్య 35 MMలో ఫిబ్రవరి 8 నాటికి అంటే 28 రోజుల్లో అక్షరాలా రూ. కోటి గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఇంతకుముందు క్రాస్ రోడ్స్‌లో ‘నరసింహ నాయుడు’ (2001), ‘అఖండ’ (2021) కోటి రూపాయల గ్రాస్ రాబట్టాయి. దీంతో కోటి రూపాయల గ్రాస్ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టారు నటసింహ. అదికూడా 13 నెలల గ్యాప్‌లో రెండు సినిమాలు, రెండింట్లోనూ ద్విపాత్రాభినయం కావడం విశేషం (అఖండ – వీర సింహా రెడ్డి).. తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు రాష్ట్రాల్లో ఈ రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది బాలయ్య మాత్రమేనంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇది ఆల్ టైన్ అన్‌బీటబుల్ రికార్డ్ అని కూడా చెప్తున్నారు. ‘అఖండ’ 53వ రోజు మ్యాట్నీకి రూ. కోటి మార్క్ టచ్ చేయగా.. ‘వీర సింహా రెడ్డి’ కేవలం 28వ రోజు ఫస్ట్ షోకే ఆ ఘనత సాధించింది. మొత్తంగా రూ. కోటి, 18 వేల 555 (1,00,18,555) గ్రాస్ వసూలు చేసింది. వరుసగా రెండు కోటి రూపాయల గ్రాస్, ఇప్పటి వరకు మూడు సినిమాలు కలిగిన ఏకైక హీరో మా బాలయ్య మాత్రమేనంటూ సామాజిక మాధ్యమాలలో హంగామా చేస్తున్నారు నందమూరి అభిమానులు..