పెద్ద పెద్ద సినిమాలకు భారీ వసూళ్లు వస్తుంటాయి. సినిమా అదిరిపోయే విజయం సాధించింది అని సంబరపోడిపోతుంటే… ఒక్కసారి వసూళ్లు డ్రాప్ అయిపోతాయి. ఏమైంది, మొన్నటివరకు బాగానే డబ్బులు వచ్చాయి అన్నారు కదా… మళ్లీ ఇదేంటిది అనే ప్రశ్న వస్తోంది. ఇప్పుడు కూడా ఇదే చర్చ జరుగుతోంది. దానికి కారణం గత వారం రిలీజ్ అయిన రెండు పెద్ద సినిమాలు. వాటిలో ఒకటి ‘సలార్’, అయితే రెండోది ‘డంకీ’. ఇక చర్చ ఏంటంటే… ‘కార్పొరేట్ బుకింగ్స్’.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నవాళ్లు ఇప్పటికే దీని గురించే వినే ఉంటారు. గత కొద్ది రోజులుగా భారతీయ సినిమా పరిశ్రమలో కార్పొరేట్ బుకింగ్స్ మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రభాస్ – ప్రశాంత్ నీల బ్లాక్‌బస్టర్ సినిమా ‘సలార్’ (Salaar) విషయంలోనూ ఈ టాపిక్ డిస్కషన్లోకి వచ్చింది. ‘సలార్’ సినిమాకు రూ. కోట్లలో కార్పొరేట్ బుకింగ్స్ జరిపినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రీసెంట్ బ్లాక్‌బస్టర్ ‘యానిమల్’ విషయంలో ఇది చేయకే వసూళ్లు కాస్త తగ్గాయి అని చెబుతున్నారు.
స్టార్ హీరోల సినిమాలకు అనుకున్న స్థాయిలో వసూళ్లు రాకపోతే ఇంకో దారిలో టికెట్లు బుక్ చేయించడాన్ని ఈ కార్పొరేట్ బుకింగ్స్ అని చెప్పొచ్చు. బల్క్‌గా ఓ సంస్థ నుండి టికెట్లు కొనేసి… అందులో పని చేసే ఉద్యోగులకు ఇవ్వడమే ఈ స్టైల్ అని చెప్పొచ్చు. ఫ్రీ టికెట్‌తో సినిమా చూసిన వాళ్లు సోషల్ మీడియాలో సినిమా గురించి పాజిటివ్ రివ్యూలు ఇస్తారు. అలా టికెట్లు తెగుతాయి, సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూస్ కూడా వస్తాయి. దీనికి కార్పొరేట్ బుకింగ్ అని సాఫ్ట్ నేమ్ పెట్టుకున్నా… ఇది ఓ రకంగా స్కామ్ అని చెప్పొచ్చు.
నిజానికి ఈ చర్చ, పుకారు ఎక్కడి నుండో రాలేఉ. ‘యానిమల్’ నిర్మాత ప్రణయ్ ఈ విషయంలో కామెంట్స్ చేశారు. ‘యానిమల్’ సినిమా ఇప్పటివరకు రూ.900 కోట్లు వసూలు చేసింది. కానీ రూ. వెయ్యి కోట్ల మార్క్ అందుకో లేకపోయింది. అయితే తాము కార్పొరేట్ బుకింగ్స్ చేస్తే సినిమా రూ.1000 కోట్లు దాటి ఉండేదని ప్రణయ్ అన్నారు. దీంతో ఇలా భారీ వసూళ్లు సాధించిన సినిమాలు ఏదో దశలో ఇలా కార్పొరేట్ బుకింగ్స్ చేశాయా అనే డౌట్ వస్తోంది ఇప్పుడు.
ఫైనల్‌గా మీకో డౌట్ ఉండొచ్చు. అలా ఏవైనా కంపెనీలు కార్పొరేట్ బుకింగ్ ఎందుకు చేస్తాయి, వాళ్లకు ఎందుకు డబ్బులు ఖర్చు అనుకోవచ్చు. అయితే అలా వాళ్లతో చేయించేది సినిమా టీమ్ అనేది ఇండస్ట్రీలో గుసగుసలు. మరి ఎవరు ఇలాంటి పని చేశారో చూడాలి. అయితే వీకెండ్‌లో ఇలా చేసి బజ్ సంపాదిస్తున్నారు అనే టాక్ కూడా ఉంది. అనుకున్నట్లుగా పెద్ద సినిమాలకు వీకెండ్ అయిపోయాక మళ్లీ ఆ స్థాయిలో వసూళ్లు రాకపోవడం గమనార్హం.