సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా కానీ అది క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది.. అందులోనూ ఈ జనరేషన్ యంగ్ స్టర్స్.. అదేనండీ.. హీరో, హీరోయిన్లు, యాంకర్ల గురించి అయితే మరీనూ.. రీసెంట్‌గా శ్రీముఖి పిక్ ఒకటి వైరల్ అవుతోంది.. యాంకర్ శ్రీముఖి.. టాలీవుడ్ టెలివిజన్ ఫీల్డులో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అండ్ బిజీయెస్ట్ యాంకర్.. హోస్ట్‌గాా, యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగు రాష్ట్రాల్లో తన పేరు తెలియని వారుండరు.. ఆ రేంజ్‌లో పాపులరిటీ తెచ్చుకుంది..
టీవీ షోల్లో ఎప్పటికప్పుడు ట్రెండీగా కనిపించే శ్రీముఖి ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌ని ఫాలో అయింది.. అలియా, సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో వచ్చిన ‘గంగూబాయి కతివాడి’ మూవీలో అచ్చం అలియా ఎలా ఉంటుందో అలా మారిపోయింది శ్రీముఖి.. తను హోస్ట్ చేస్తున్న ఓ రియాలిటీ షో కోసం ఎపిసోడ్ థీమ్ గెటప్ అంటూ ‘గంగూబాయి’ గెటప్‌లోకి మారిపోయింది.. అచ్చం అలియాలానే ఉన్న యాంకరమ్మ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది..