నేచురల్ స్టార్ నాని హీరోగా విరించి వర్మ డైరెక్షన్లో వచ్చిన ‘మజ్ను’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యింది అనూ ఇమ్మాన్యూయల్. ఈ చిత్రం హిట్టవ్వడం అలాగే తన నటనకి కూడా మంచి మార్కులు పడటంతో దర్శకనిర్మాతల దృష్టి ఈ అమ్మడి పై పడింది. ఇక రాజ్ తరుణ్ తో చేసిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రం కూడా పర్వాలేదనిపించడంతో.. వరుస ఆఫర్లు క్యూలు కట్టాయి. అది కూడా చిన్న రేంజ్ ఆఫర్లు కాదు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం. అందులోనూ త్రివిక్రమ్ డైరెక్టర్.. అంతే ఈ అమ్మడి కెరీర్ సెట్టయిపోయినట్టే అని అందరూ అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ చిత్రం ఘోరంగా డిజాస్టర్ అయ్యింది.
అయినప్పటికీ అమ్మడికి మంచి ఆఫర్లే వచ్చాయి. అల్లు అర్జున్ సరసన ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’, గోపీచంద్ సరసన ‘ఆక్సిజన్’, నాగచైతన్య సరసన ‘శైలజా రెడ్డి అల్లుడు’. ఏ హీరోయిన్ కి అయినా ఇంత త్వరగా ఇటువంటి పెద్ద అవకాశాలు వస్తాయా అంటే సందేహమనే చెప్పాలి. కానీ అను ఇమ్మాన్యూయల్ కి మాత్రం త్వరగానే వచ్చాయి. కానీ ఇవన్నీ డిజాస్టర్లు కావడంతో ఈ భామకి ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర పడిపోయింది. మధ్యలో వచ్చిన ‘గీత గోవిందం’ చిత్రం హిట్టయ్యింది. కానీ ఇందులో ఆమెది కేవలం అతిధి పాత్రే.. కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి ‘గీత గోవిందం’ చిత్రంలో హీరోయిన్ అవకాశం ముందు అనూ వద్దకే వచ్చిందట. కానీ పెద్ద సినిమాలు ఉన్నాయని… ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేసిందట. ఇక ఈ దీంతో చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోయిందట. ఈమద్యే కాస్త విశ్రాంతి తీసుకుని మళ్ళీ కథలు వింటుందట. అయితే తన కాద్దకు వచ్చిన దర్శక నిర్మాతలకి ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో రావాలని కోరుతుందట. లైన్ చెప్పి ఓకే చెప్పడానికి అస్సలు రెడీ గా లేదట. దీని పై ఆ దర్శక నిర్మాతలు మాత్రం చాలా అసంతృప్తికి గురవుతున్నారట. ‘అసలే ప్లాపుల్లో ఉన్న హీరోయిన్ ని ఒప్పించడానికి ఇంత కష్టపడాల… స్టార్ హీరోలతో సినిమా అవకాశాలు రాగానే ఎగిరి గంతేసి… గుడ్డిగా ఒప్పేసుకోకుండా ముందే స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్త పడితే బాగుండేది. ఇప్పుడు ప్లాపుల్లో ఉండి కూడా ఇలా ప్రవర్తిస్తే ఎలా అంటూ’.. నవ్వుకుని వెళ్ళిపోతున్నారట ఆ దర్శకనిర్మాతలు. ఈ లిస్ట్ లో పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ ఆఫర్ కూడా ఉందట.