ఓ దర్శకుడు ఓ హీరోని దృష్టిలో పెట్టుకుని కథ రాసుకోవచ్చు. కానీ ఏ హీరోనైతే ఊహించుకుని కథ రాస్తాడో, ఆ హీరో ఆ కథకి ఓకే చెప్తాడు అన్న గ్యారంటీ ఉండదు. అది అతనికి నచ్చకపోవచ్చు లేదా ఆ టైంలో అతనికి వేరే కమిట్మెంట్లు ఉండొచ్చు. అందుకే కథ రాసుకోవడం వరకే డైరెక్టర్ వంతు. అది హీరోకి వెళ్తుంది అనేది దైవాధీనం. ఇలా ఒక హీరో కోసం రాసుకున్న కథను వేరే హీరోతో చేసినప్పుడు ఆ మూవీ సక్సెస్ అవ్వచ్చు లేదా ఫెయిల్ అవ్వచ్చు.
ఏది చెప్పలేము. రిజల్ట్ మాత్రం ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. సరే ఇదంతా ఎందుకు చెప్పుకోవాలి అంటే.. హీరో రామ్ కు ఎప్పటి నుండో ఓ పోలీస్ కథలో నటించాలనేది ఓ డ్రీం. పోలీస్ కథలు చాలా వరకు ఒకేలా ఉంటాయి. పోలీస్ గా ఉన్న హీరో ఓ క్రిమినల్ ను కెలకడం, ఆ విలన్ హీరోని ఏమీ చేయలేక అతని ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం. ఆ హీరో ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా అయితే.. హీరో విలన్ ను రూల్స్ పక్కన పెట్టి మర్డర్ చేయడం.
దాదాపు ఇలాగే సాగుతాయి పోలీస్ సినిమాల కథలు. అందుకే రామ్ డిఫెరెంట్ గా ఉంటుందని ‘ది వారియర్’ చిత్రం చేశాడు. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకుడు. కథ బాగానే ఉన్నా.. ఎందుకో ఈ సినిమా జనాలను ఆకట్టుకోలేకపోయింది. అయితే ‘ది వారియర్’ కథ కంటే ముందు రామ్ వద్దకు వేరే పోలీస్ కథ వెళ్ళిందట. అదే ‘క్రాక్’. రామ్ తో ‘పండగ చేస్కో’ వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన గోపీచంద్ మలినేని..
‘క్రాక్’ కథను మొదట రామ్ కు వినిపించాడట. కథ రామ్ కు నచ్చింది. కానీ ఈ కథలో హీరో ఓ పిల్లాడికి తండ్రిగా చేయాలి. అది మాత్రం రామ్ కు నచ్చలేదు. అందుకే ‘క్రాక్’ కథని రవితేజతో చేశాడు గోపీచంద్ మలినేని. అది సూపర్ హిట్ అవ్వడం, రవితేజ కంబ్యాక్ ఇవ్వడం జరిగింది.