రాజమౌళి సృష్టించిన మాహిష్మతి రాజ్యమే కాదు, ఆ రాజ్యానికి చెందిన ముద్ర కూడా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాలుగు మెట్లపైన సింహాసనం, దాని పక్కన రెండు గుర్రాలు, వెనుక సూర్యుని చిహ్నం కలిగిన ఈ ముద్ర బాహుబలి బిగినింగ్ ని చూసిన ప్రతి ఒక్కరికీ గుర్తే. అయితే తాజాగా మరో ముద్ర వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో ఇదివరకు ఉన్నగుర్రాలు మిస్సయ్యాయి. ఇదే విషయాన్నీ గమనించిన బాహుబలి అభిమాని ” ఈ గుర్రాలు ఎందుకు మిస్సయ్యాయి.. ఆ రాజ ముద్రలు ఎవరివి” అనే ప్రశ్నను ట్విట్టర్ వేదికపై బాహుబలి చిత్ర బృందం ముందు ఉంచారు.
ఈ ప్రశ్నపై రాజమౌళి తనయుడు, బాహుబలి సెకండ్ యూనిట్ డైరక్టర్ కార్తికేయ స్పందించారు. “గుర్రాలు కలిగిన రాజ ముద్ర మాహిష్మతి రాజ్యానిది, అది లేకుండా ఉన్న ముద్ర భల్లాలదేవుడిది” అని సమాధానమిచ్చారు. అంటే కట్టప్ప బాహుబలిని చంపిన తర్వాత మాహిష్మతి రాజ్యం భల్లాల రాజ్యంగా మారుతుందని ఈ సమాధానం స్పష్టం చేసింది. భల్లాల దేవుడు రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్న తరవాత రాజ ముద్రను మార్చివేసినట్లు అర్ధమవుతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.