ఒకప్పుడు సౌత్ లో హవా అంతా తమిళ స్టార్ హీరోలదే. తమిళ స్టార్స్ కి పెద్ద మార్కెట్ గా సౌత్ ఇండియా ఉండేది. కమల్, రజిని కాంత్ వంటి స్టార్స్ సినిమాలకు దేశవ్యాప్తంగా ఆదరణ దక్కేది. టాలీవుడ్ నుండి ఆ స్థాయి మార్కెట్ సాధించిన హీరోలు పెద్దగా లేరనే చెప్పాలి. గత దశాబ్దంగా కొత్త పుంతలు తొక్కుతున్న తెలుగు పరిశ్రమ దేశంలో భారీ చిత్రాలు నిర్మించే పరిశ్రమగా ఎదిగింది. మన యంగ్ స్టార్ హీరోలకు పక్క రాష్ట్రాలలో కూడా మార్కెట్, ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
దీనితో వీరి సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఇక టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన ప్రభాస్ మరియు మహేష్ అరుదైన రికార్డ్స్ సొంతం చేసుకున్నారు. వీరు సౌత్ ఇండియాలోనే ఆ ఘనత సాధించిన హీరోలుగా రికార్డులకు ఎక్కారు. మహేష్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 10 మిలియన్స్ కి చేరింది. ఇంత వరకు సౌత్ ఇండియాలో 10 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్స్ కలిగిన స్టార్ హీరో లేరు. ఆ రికార్డు అందుకున్న మొదటి హీరోగా మహేష్ రికార్డు కొట్టాడు.
అంటే ఏకంగా ఒక కోటి మంది మహేష్ ని ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారన్న మాట. ఇక అలాంటిదే ప్రభాస్ కూడా ఓ రికార్డు నమోదు చేశారు. ఆయన పేస్ బుక్ లో తన ఫాలోవర్ల సంఖ్య 15 మిలియన్స్ కి పెంచుకొని సౌత్ ఇండియాలోనే ఆ ఘనత సాధించిన హీరోలుగా నిలిచాడు. ప్రభాస్ కి సోషల్ మీడియా అకౌంట్స్ లో కేవలం పేస్ బుక్ మరియు, ఇంస్టాగ్రామ్ మాత్రమే ఉన్నాయి. ఇక పేస్ బుక్ లో ఆయన్ని కోటి యాభై లక్షల మంది ఫాలో అవుతున్నారన్న మాట. సౌత్ ఇండియాలోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోలుగా మహేష్, ప్రభాస్ రికార్డ్స్ సొంతం చేసుకున్నారు.