సాధారణంగా ఒక సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకొన్నామంటే హీరో అయినా హీరోయిన్ అయినా ప్రారంభోత్సవం నుంచి థియేటర్లలో సినిమా ప్రదర్శితమయ్యే మొదటివారం వరకూ షూటింగ్, ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్, థియేటర్ విజిట్స్ అన్నిట్లో భాగస్వాములవుతాం అని అగ్రిమెంట్ చేసినట్లు. అయితే.. ఈమధ్యకాలంలో హీరోలు పర్లేదు కానీ.. హీరోయిన్లు మాత్రం షూటింగ్ కి సపోర్ట్ చేస్తే సినిమా ప్రమోషన్స్ ను పట్టించుకోవడం లేదు. ఈ పద్ధతిని మొదలెట్టింది నయనతార. సినిమా ప్రమోషన్స్ కి రాను అని అగ్రిమెంట్ టైమ్ లోనే రాయించుకొనేది.
ఇప్పుడు కొత్త హీరోయిన్లు కూడా ఆ పద్ధతిని ఫాలో అవుతున్నారు, ఆ జాబితాలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది పూజా హెగ్డే పేరు. అమ్మడు సినిమాలో నటించినందుకు తీసుకొనే రెమ్యూనరేషన్ కాకుండా సపరేట్ గా ప్రమోషన్స్ కోసం కూడా భారీ మొత్తంలో చార్జ్ చేస్తుందట. “దువ్వాడ జగన్నాధం” విషయంలోనూ ఇదే పద్ధతిని ఫాలో అయ్యిందట. ఇప్పుడు “సాక్ష్యం” సినిమా విషయంలోనూ పూజా హెగ్డేకి కేవలం ఓ అయిదు ఇంటర్వ్యూలు ఇవ్వడం మరియు రెండు ప్రమోషనల్ ఈవెంట్స్ అటెండ్ అవ్వడం కోసం భారీ మొత్తం కట్టబెట్టారట. పూజా ఫాలో అవుతున్న ఈ ప్రోసెస్ సక్సెస్ అయితే.. అతి త్వరలోనే ఆల్మోస్ట్ అందరు హీరోయిన్లు ఈ పద్ధతిని ఫాలో అవ్వడం ఖాయం.