టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు ప్రభాస్ ఒకరు. ఈయన ఈశ్వర్ సినిమా ద్వారా కృష్ణంరాజు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక ప్రభాస్ సత్యానంద్ గారి వద్ద శిక్షణ తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే తాజాగా సత్యానంద్ గారి పుట్టినరోజు కావడంతో ప్రభాస్ తన గురువు గారికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ సత్యానంద్ గారి వద్ద శిక్షణ తీసుకొని ఈశ్వర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా నటనలో తనని తాను నిరూపించుకుంటూ నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ఈయన పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ తన మూలాలను మర్చిపోలేదని చెప్పాలి. ప్రభాస్ తనకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినటువంటి తన గురువు గారి పుట్టినరోజు కావడంతో ఈయన తన గురువు కోసం ఏకంగా పూర్తి బంగారంతో తయారు చేస్తున్నటువంటి చేతి వాచ్ ను తనకు కానుకగా ఇచ్చారు.
అయితే ప్రభాస్ స్వయంగా తన గురువు వద్దకు వెళ్లి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా తానే సత్యానంద్ చేతికి తొడిగారు. ఇక పుట్టినరోజు సందర్భంగా తనకు విలువైన కానుకను ఇస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఈ వాచ్ మీకు నచ్చిందా గురువుగారు అంటూ ఎంతో ఆప్యాయంగా అడిగారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో (Prabhas) ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ఎంతో ఎత్తుకు ఎదిగిన తన అనుకున్న వారి పట్ల ఎప్పుడు ఇలాంటి ప్రేమను చూపిస్తూ ఉంటారంటూ కామెంట్లు చేస్తున్నారు.