మార్చి 27న మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) పుట్టినరోజు. సో కచ్చితంగా అతని నెక్స్ట్ సినిమాలకి సంబంధించిన ఒక అప్డేట్ కావాలి. అసలే ‘గేమ్ ఛేంజర్’ (Game changer) ఫలితంతో వాళ్ళు చాలా డిజప్పాయింట్ అయ్యారు. దాన్ని మరిపించడం కోసమైనా ఒక అప్డేట్ కావాలి. చరణ్ నెక్స్ట్ సినిమా బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ మధ్యనే షూటింగ్ కూడా మొదలైంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
అతనిపై అలాగే చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. చరణ్ లేని పార్ట్ కూడా కొంత షూట్ చేశారు. సో ఓ చిన్నపాటి టీజర్ వదిలే అవకాశం ఉంది. అది నిజమే అని నిర్మాతల్లో ఒకరైన మైత్రి రవి (Y .Ravi Shankar) కూడా క్లారిటీ ఇచ్చారు. ‘రాబిన్ హుడ్’ (Robinhood) ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ…”రాంచరణ్- బుచ్చిబాబు గారి సినిమా టీజర్ నిన్నే చూశాము అండి.
అందులో ఒక్క షాట్ కోసం మినిమమ్ 1000 సార్లు చూస్తారు. అందులో ఓ లెంగ్తీ షాట్ ఉంది. దానికోసం. ఎక్స్ట్రార్డినరీగా వచ్చింది” అంటూ అంచనాలు పెంచేశారు మైత్రి రవి. అయితే టీజర్/ గ్లింప్స్ రేపు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ‘ఆర్.ఆర్ ఆలస్యంగా కంప్లీట్ అయ్యింది. అలాగే చిన్న చిన్న కరెక్షన్స్ ఉండటం వల్ల..
ఆలస్యం అవుతుంది’ అని కూడా మైత్రి రవి చెప్పుకొచ్చారు. అయితే కచ్చితంగా ఎప్పుడొస్తుంది అనేది ఆయన రివీల్ చేయలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఒకరోజు ఆలస్యంగా అంటే ఉగాది రోజున(మార్చి 28న) రిలీజ్ చేయాలనే ఆలోచనలో టీం ఉన్నట్టు సమాచారం.
ఒక్క షాట్ కోసం 1000 సార్లు చూస్తారు..!#Rc16update #Rc16 #RamCharanRevolts #RamCharan #HappyBirthdayRamCharan #HBDRamCharan #RC16teaser #Peddi pic.twitter.com/Ux3xvbWRwn
— Phani Kumar (@phanikumar2809) March 26, 2025