సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడుతుండగా వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకుంటున్నారు. అయితే తాజాగా రజనీకాంత్ వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతిని చేయడం తనకు నచ్చలేదంటూ కామెంట్ చేశారు. సెపియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్ ఈ కామెంట్లు చేశారు. వెంకయ్య నాయుడు గొప్ప నాయకుడు అని ఆయనను రాజకీయాల నుంచి దూరం చేయడం కరెక్ట్ కాదని ఆయన తెలిపారు.
ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్నవాళ్లకు ఎలాంటి అధికారాలు ఉండవని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. మరి కొంతకాలం ఆయన కేంద్ర మంత్రిగా కెరీర్ ను కొనసాగించి ఉంటే బాగుండేదని ఆయన తెలిపారు. రజనీకాంత్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వెంకయ్య నాయుడు రజనీకాంత్ గురించి మాట్లాడుతూ రజనీకాంత్ మంచి నటుడని ఆయన రాజకీయాల్లోకి రావద్దని నేను చెప్పానని ఆయన తెలిపారు. హెల్తీగా ఉండాలంటే రాజకీయాల్లోకి రావద్దని నేను సూచనలు చేశానని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు ఒక్కటే మార్గం కాదని ఆయన కామెంట్లు చేశారు. రాజకీయాల్లోకి వచ్చేవాళ్లను తాను నిరుత్సాహపరచనని ఆయన తెలిపారు. భావజాలానికి నిబద్ధత, అంకిత భావం, నిజాయితీ, క్రమశిక్షణ ఉంటే మాత్రమే రాజకీయాల్లోకి రావాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఆయన చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోయినా మంచి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. రజనీకాంత్ టాలీవుడ్ హీరోలతో కలిసి నటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. తెలుగు సినిమాల విషయంలో ఆయన అభిప్రాయం ఏంటో తెలియాల్సి ఉంది. రజనీకాంత్ భిన్నమైన కథలకు ఓటేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. వయస్సు పెరుగుతున్నా రజనీకాంత్ ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.