Mahesh , Pushpa: మహేష్ పుష్పను రిజెక్ట్ చేయడంలో ట్విస్ట్ ఇదేనా?

పుష్ప ది రైజ్ రిలీజ్ సమయంలో మిక్స్డ్ టాక్ రాగా సోషల్ మీడియాలో నెటిజన్లు పుష్ప ది రైజ్ మూవీని రిజెక్ట్ చేసి మహేష్ బాబు మంచి పని చేశారని కామెంట్లు చేశారు. అయితే ఆ తర్వాత టాక్ తో సంబంధం లేకుండా పుష్ప కలెక్షన్లను సాధించడంతో పాటు బాలీవుడ్ లో కూడా అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో మహేష్ బాబు పుష్ప సినిమా చేసి ఉంటే బాగుండేదని కొంతమంది అభిప్రాయపడ్డారు.

Click Here To Watch NOW

అయితే మహేష్ బాబు పుష్పను రిజెక్ట్ చేయడం వెనుక అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ హీరోగా తెరకెక్కిన పుష్ప మూవీ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. మహేష్ రాజమౌళి కాంబినేషన్ మూవీ సైతం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కనుంది. వరుసగా ఒకే నేపథ్యంలో ఉన్న సినిమాలలో నటించడం ఏ హీరోకైనా కెరీర్ పరంగా ప్లస్ కాదు. ఈ రీజన్ వల్లే మహేష్ పుష్ప కథకు నో చెప్పి ఉండవచ్చని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

మహేష్ పుష్ప కథకు నో చెప్పడానికి జక్కన్న పరోక్షంగా కారణమయ్యారని కొంతమంది మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 1 నేనొక్కడినే సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చినా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అందువల్ల కూడా సుకుమార్ తో సినిమా చేయడానికి మహేష్ ఆసక్తి చూపలేదని మరి కొందరి నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే భవిష్యత్తులో మాత్రం మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసి రాజమౌళి సినిమాకు డేట్స్ కేటాయించే అవకాశం ఉంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ కోసం కనీసం మూడేళ్లు ఎదురుచూపులు తప్పవని మహేష్ అభిమానులు సైతం ఫిక్స్ అయ్యారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus