దర్శకుడ్ని భయపెట్టిన స్టార్ కమెడియన్
- February 24, 2018 / 01:49 PM ISTByFilmy Focus
అయిదారేళ్ళ క్రితం వరకూ కమెడియన్ గా టాప్ ఫామ్ లో కొనసాగి, అనంతరం హీరోగా ట్రై చేసి మొదట్లో ఫర్వాలేదనిపించుకొన్నా తర్వాతి కాలంలో వరుసపరాజయాలతో చతికిలపడి కనుమరుగయ్యే స్థాయికి చేరుకొన్నాడు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఓ కామెడీ సినిమాలో నటిస్తున్న సదరు స్టార్ అవ్వాలనుకొన్న కథానాయకుడు తనతో ఒక సినిమా చేస్తానని చెప్పి, ఆఖరి నిమిషంలో అతడి బదులు వేరే యంగ్ హీరోని సెలక్ట్ చేసుకొని సినిమా షూటింగ్ మొదలెట్టిన ఒక యువ దర్శకుడ్ని ఆప్యాయంగా ఇంటికి పిలిచి మరీ బెదిరించాడట సదరు కమెడియన్.
దాంతో జడిసిపోయిన ఆ యువ దర్శకుడు “నేనీ సినిమా చేయను” అంటూ సదరు సినిమాలో నటిస్తున్న హీరోహీరోయిన్లతోపాటు నిర్మాతకి కూడా ఒక మెసేజ్ పెట్టి ప్రస్తుతం అజ్ణాతవాసంలో ఉన్నాడట. దాంతో సదరు సినిమా తీస్తున్న కొత్త నిర్మాత ఫిలిమ్ ఛాంబర్ ను సంప్రదించగా.. ఛాంబర్ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి మరీ ఈ గొడవను సర్దిచెప్పి.. సదరు స్టార్ కమెడియన్ కి ఇకనైనా జాగ్రత్తగా ఉండమని చెప్పారట. మరి ఆ కమెడియన్ ఇకనైనా హీరో రోల్స్ మీద ఫోకస్ చేయడం మాని వచ్చిన ఆఫర్లను సద్వినియోగపరుచుకుంటాడేమో చూడాలి.












