‘డైలాగ్ కింగ్ ‘ అనగానే మనకి టక్కున గుర్తొచ్చే పేరు సాయి కుమార్. హీరోగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సహాయ నటుడుగా, విలన్ గా ఆయన ఎన్నో సినిమాలకు పనిచేసారు. ముఖ్యంగా ఈయన నటించిన ‘పోలీస్ స్టోరీ’ చిత్రం ఈయనకు హీరోగా మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రం తరువాత ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అనే చెప్పాలి. ఈ చిత్రంలో యాంగ్రీ యంగ్ మెన్ అగ్నిగా ఈయన నటన అద్బుతం. ‘కనిపించే మూడు సింహాలు.. నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతి రూపాలు అయితే.. కనబడని ఆ నాలుగో సింహమేరా పోలీస్’ అంటూ సాయి కుమార్ చెప్పిన డైలాగ్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.
‘ఇప్పటికీ ఆ డైలాగ్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టిస్తుంటుంది’ అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. అయితే నిజానికి ఈ చిత్రంలో హీరోగా మొదట సాయి కుమార్ ను అనుకోలేదట.ఓ పక్క కన్నడ సినిమాల్లో హీరోగా..మరోపక్క తెలుగు సినిమాల్లో విలన్ గా చేస్తూ వచ్చిన దేవ రాజ్ ను మొదట ‘పోలీస్ స్టొరీ’ సినిమాలో హీరోగా అనుకున్నాడట దర్శకుడు థ్రిల్లర్ మంజు. అయితే కథ ప్రకారం.. ‘పొలీస్ స్టొరీ’ లో హీరోయిన్ ఉండదు.. రొమాన్స్, పాటలు వంటి వాటికి స్కోప్ లేదు. అందుకే ఆ సినిమాని దేవరాజ్ తో పాటు అక్కడి పెద్ద హీరోలు చెయ్యలేదట. థ్రిల్లర్ మంజుతో సాయి కుమార్.. అప్పటికే పలు సినిమాలు చేశాడు.
ఇద్దరికీ మంచి స్నేహం కూడా ఉంది. ఆ కారణంగా.. సాయి కుమార్ నే హీరోగా ఫిక్స్ చేశాడట థ్రిల్లర్ మంజు. తరువాత ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడం. పోలీస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల్లో ఇది ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలవడంతో .. సాయి కుమార్ ఇమేజ్ మరింత పెరిగిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సాయి కుమార్ చెప్పుకొచ్చాడు.