ఈ నెల 21వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న షారుఖ్ ఖాన్ డంకీ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రాగా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ లో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు 75 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.
షారుఖ్ ఖాన్ డంకీ (Dunki) సినిమా సంచలనాలు సృష్టిస్తారో లేదో చూడాల్సి ఉంది. షారుఖ్ ఖాన్ గత సినిమాల స్థాయిలో ఈ సినిమాకు బుకింగ్స్ జరగడం లేదని సమాచారం అందుతోంది. షారుఖ్ ఖాన్ పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న హీరోలలో ఒకరిగా ఉన్నారు. షారుఖ్ ఖాన్ కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సౌత్ లో ఒక భారీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం షారుఖ్ ఖాన్ కు వచ్చినా ఆ ప్రాజెక్ట్ ను సున్నితంగా రిజెక్ట్ చేశారని సమాచారం అందుతోంది. షారుఖ్ ఖాన్ తాజాగా డిస్ట్రిబ్యూటర్లను కలవగా అడ్వాన్స్ బుకింగ్స్, ట్రెండ్స్, పబ్లిక్ టాక్ ఆధారంగా షోలు కేటాయించాలని తెలుస్తోంది. సలార్ తో పోటీ డంకీ సినిమాకు మేలు చేస్తుందో కీడు చేస్తుందో చూడాల్సి ఉంది. ఈ గురువారం నుంచి థియేటర్లు కళకళలాడుతున్నాయి.
మరికొన్ని గంటల్లో సలార్ మూవీ బుకింగ్స్ మొదలుకానున్నాయి. టికెట్ రేట్ల పెంపు వల్లే ఈ సినిమా బుకింగ్స్ ఆలస్యమవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సలార్ మూవీ రిలీజ్ తర్వాత సృష్టించాల్సిన సంచలనాల గురించి చర్చ జరుగుతోంది. సలార్1 మూవీ సంచలనాలు సృష్టించడం ఖాయమని చెప్పవచ్చు. లియో ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డ్ ను సలార్ మూవీ బ్రేక్ చేస్తుందో చూడాలి.