ఇటీవల దొంగలు పట్టపగలే ఇళ్లలోకి దూరి మరి దోచుకోవడం మొదలుపెట్టారు. సామాన్యులనే కాదు.. సెలబ్రిటీలను సైతం వదలడం లేదు. అటువంతి సంఘటనే మంగళవారం చంఢీగర్ లో చోటు చేసుకుంది. ముగ్గురు దుండగులు నటి, మోడల్ అలంకృత సహాయ్ ని బంధించి దాదాపు రూ.6 లక్షల వరకు దోచుకెళ్లారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మోడల్, నటి అలంకృత తన తల్లితండ్రుల కోసం ఇటీవల చంఢీగర్ లోని సెక్టార్ 27లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది.
ఢిల్లీలో ఉన్న వాళ్లు రేణు, మూడు రోజుల్లో ఇక్కడకి షిఫ్ట్ కావాల్సింది. యి తరుణంలో మంగళవారం అలంకృత అక్కడి వచ్చి ఏర్పాట్లను పరిశీలించింది. ఆ సమయంలో ఆమె ఒంటరిగా ఉందని గమనించి దుండగులు బలవంతగా అలంకృత ఇంట్లోకి దూరి దొంగతనానికి పాల్పడ్డారు. దొంగతనానికి వచ్చిన ముగ్గురిలో ఒకరు ఆమె ఏటీఎం కార్డుని తీసుకెళ్లి రూ.50 వేలు విత్ డ్రా చేశాడు. ఆ సమయంలో మిగిలిన ఇద్దరు అలంకృతను బంధించి.. గోల చేస్తే చంపేస్తామని బేందిరించారు.
అంతేకాదు.. ఇంట్లో ఉన్న డబ్బు, నగలను కూడా తీసుకెళ్లారు. మొత్తం రూ.6 లక్షలు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం అలంకృత ఫర్నిచర్ కొనగా.. ఆదివారం కొందరు వాటిని డెలివెరీ చేశారు. వారిలో ఒకరు ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది అలంకృత. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.