శివరాత్రి రోజు భక్తులు తప్పక చూడవలసిన ఐదు చిత్రాలు ఇవే..!

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి సందడి మొదలైపోయింది.. ఈ నేపథ్యంలో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి 11వ తేదీ నుంచి మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బెజవాడ దుర్గా మలేశ్వరుని ఆలయంలో, కోటప్ప కొండలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా మహా శివరాత్రి వేళ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తాము కోరుకున్న కోరికలను నెరవేర్చుకునేందుకు రుద్రాభిషేకం, జలాభిషేకం వంటి ప్రత్యేక పూజలు చేస్తారు.

ఇక శివరాత్రి అప్పుడు భక్తి శ్రద్ధలతో చేసే జాగారం సమయంలో సినిమా అనేది చక్కటి కాలక్షేపం.. అర్థరాత్రి వేళ 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు రెండేసి సినిమాలను ప్రదర్శించడం అనేది ఎప్పటినుండో జరుగుతూ వస్తోంది. అప్పట్లో ఒక టికెట్ మీద రెండు షోలు చూడడం అన్నది మర్చిపోలేని అనుభవం.. ఓటీటీల వల్ల చాలామంది ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలు చూస్తున్నారు. శివరాత్రి రోజు ఇంటిల్లిపాదీ ఆధ్యాత్మికత కోసం తప్పక చూడాల్సిన ఐదు చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1) భూకైలాస్..

అలనాటి చిత్రం అయినప్పటికీ నేటికీ కొత్త అనుభూతి కలిగిస్తుంది ‘భూకైలాస్’.. నాగభూషణం పరమశివుడిగా.. ఎన్టీఆర్ రావణాసురుడిగా, ఏఎన్నార్ నారదుడిగా నటించి మెప్పించారు..

2) భక్తకన్నప్ప..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శివుని మీద వచ్చిన చిత్రాలలో ఒక క్లాసిక్‌గా నిలిచిన చిత్రం ‘భక్తకన్నప్ప’.. శివుడు, భక్తుడు పాత్రలలో కృష్ణంరాజు నటన అమోఘం.. ‘భక్తకన్నప్ప’ గా జీవించారాయన..

3) ‘మహా శివరాత్రి’..

మీనా ప్రధాన పాత్రలో.. సాయి కుమార్, రాజేంద్ర ప్రసాద్ కలిసి నటించిన సినిమా ‘మహా శివరాత్రి’.. రేణుక శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శివరాత్రి నాడు చూడదగ్గ సినిమా..

4) శ్రీమంజునాథ..

శివరాత్రి అనగానే ‘శ్రీమంజునాథ’ సినిమా గుర్తొస్తుంది.. నాస్తికుడు, భక్తుడిగా ఎలా మారాడన్నదే కథాంశం.. చిరంజీవి శివుడిగా, అర్జున్ భక్తుడిగా నటించి మెప్పించారు..

5) జగద్గురు ఆదిశంకర..

ఆదిశంకరాచార్యుల జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా.. ‘జగద్గురు ఆదిశంకర’.. నాగార్జున, కౌశిక్ బాబు, మోహన్ బాబు, సుమన్, శ్రీహరి, మీనా, రోజా, కమిలినీ ముఖర్జీ తదితరులు నటించారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus