Adipurush: ప్రభాస్‌ ముందే చెప్పాడట… కానీ ఆయన వినలేదట.. నటుడి వ్యాఖ్యలు వైరల్‌!

ప్రభాస్‌ (Prabhas) అభిమానులు నిద్రలో కూడా కలవరించిన సినిమా (Adipurush) ‘ఆదిపురుష్‌’. ఆ సినిమా కోసం ఎంతగా వెయిట్‌ చేశారో… టీజర్‌ వచ్చాక అంతగా సినిమా రావొద్దు అనుకున్నారు. ఏవేవో టింకరింగ్‌లు చేసి ట్రైలర్లు తెచ్చినా అదే పరిస్థితి. సినిమాలో కథ గురించి మామూలుగా అయితే మాట్లాడకూడదు. ఎందుకంటే అది రామాయణం. కానీ దానిని కూడా ఆయన తన శైలిలో చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో మాట్లాడాల్సి వచ్చింది. ఆయన ఆలోచనను, చేసిన పని గురించి అడగాల్సి వచ్చింది.

తాజాగా ఈ సినిమా గురించి ఆ సినిమాలో నటించిన వ్యక్తి ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. ప్రభాస్ – ఓం రౌత్‌ (Om Raut) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఆదిపురుష్‌’. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన విందూ ధారా సింగ్ ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఆదిపురుష్‌’ సినిమాను డైరెక్టర్ ఓం రౌత్ గందరగోళంగా తీసి ఫ్లాప్ చేశారని చెప్పారు. సినిమాలో కొన్ని డైలాగులు మార్చమని నటీనటులు కొంతమంది దర్శకుడు ఓం రౌత్‌ను అడిగారట.

ఆ డైలాగులు నోరు తిరగడం లేదని, చెప్పడానికి ఇబ్బందిగా ఉందని, రిలీజ్ అయ్యాక ట్రోల్ చేస్తారని కూడా వాళ్లు ఓం రౌత్‌కి చెప్పారట. కానీ ఓం రౌత్‌ వినలేదట. ‘ఆదిపురుష్’ సినిమా మొదలుపెట్టినప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. రామాయణం ఆధారంగా తీసిన ఈ సినిమా కచ్చితంగా వసూళ్ల సునామీ సృష్టిస్తుందని అనుకున్నారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమాలో నాసిరకం గ్రాఫిక్స్ చూసి కల్ట్‌ ఫ్యాన్స్‌కూడా ట్రోల్‌ చేశారు.

ప్రభాస్ తప్పేం లేదని అన్నింటికీ ఓం రౌత్‌ కారణమని అన్నారు. ఇప్పుడు విందూ కూడా అదే మాట అన్నారు. నిజానికి డైలాగ్‌ల విషయంలోనే కాదు… పాత్రల చిత్రణ, వాళ్ల వ్యవహార శైలి విషయంలోనూ ఔం రౌత్‌ మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రావణాసురుడిని చూపించిన విధానం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని కూడా అన్నారు. కానీ అదే మొండిగా సినిమా రిలీజ్‌ చేసి ట్రోల్‌ అయ్యారు.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus