Prabhas: ప్రభాస్ నుంచి అస్సలు ఊహించలేదు.. ప్రముఖ నటి ఏమన్నారంటే?

స్టార్ హీరో ప్రభాస్ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఖాతాలో ఎన్నో భారీ విజయాలు ఉండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ప్రభాస్ మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ప్రాజెక్ట్ కే సినిమాలో కీలక పాత్రలో నటించిన అన్నా బెన్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటివరకు ప్రభాస్ ను నేను వ్యక్తిగతంగా కలవలేదని అన్నా బెన్ చెప్పుకొచ్చారు. కానీ ప్రభాస్ నాకోసం ఆహారాన్ని పంపిస్తారని అస్సలు ఊహించలేదని ఆమె కామెంట్లు చేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గొప్పదనం గురించి అన్నా బెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ప్రాజెక్ట్ కే సినిమాలో తనకు ఎలా అవకాశం వచ్చిందనే విష్హయాన్ని సైతం ఆమె చెప్పుకొచ్చారు. పభాస్ పంపిన ఆహారాన్ని నేను ఎంతో ఇష్టంగా తిన్నానని అన్నా బెన్ పేర్కొన్నారు.

త్వరలోనే (Prabhas) ప్రభాస్ ను వ్యక్తిగతంగా కలవాలని అనుకుంటున్నానని ఆమె కామెంట్లు చేశారు. జూమ్ కాల్ ద్వారా నాగ్ అశ్విన్ నాకు మూవీ ఆఫర్ ఇచ్చారని అన్నా బెన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలో ప్రాజెక్ట్ కే టీజర్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఈ టీజర్ మరింత స్పెషల్ గా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రాజెక్ట్ కే మూవీ మే నెల 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ప్రాజెక్ట్ కే నైజాం హక్కులు ఏకంగా 80 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇతర ఏరియాల బిజినెస్ హక్కుల గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus