Anushka, Naveen Polishetty: నవీన్ అనుష్క మూవీ టైటిల్ ఇదేనా..?

స్టార్ హీరోయిన్ అనుష్క ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న అనుష్క నిశ్శబ్దం సినిమా తరువాత యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ సినిమా షూటింగ్ మొదలుకాలేదు. మరోవైపు బరువు తగ్గి అనుష్క మునుపటి లుక్ లోకి మారడంతో అనుష్క కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం జూన్ నెలాఖరు నుంచి అనుష్క కొత్త సినిమా షూటింగ్ మొదలు కానుందని సమాచారం. ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ అయిందని “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ” టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. అనుష్క షూటింగ్ లో పాల్గొనడానికి ఓకే చెప్పడంతో త్వరలో షూటింగ్ మొదలు కానుందని సమాచారం.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో నవీన్ పోలిశెట్టి నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు పాపులారిటీని పెంచుకున్నారు. జాతిరత్నాలు సక్సెస్ తరువాత నవీన్ పోలిశెట్టి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే అనుష్క స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటిస్తే బాగుంటుందని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ కోరికను అనుష్క తీరుస్తారో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు నవీన్ పోలిశెట్టితో సినిమాలు తీయాలని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus