ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఏపీలో పదుల సంఖ్యలో థియేటర్లు మూతబడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతులను నిరాకరించడంతో పాటు అదనపు షోలకు కూడా అనుమతులు ఇవ్వడం లేదు. అయితే 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాకు మినహాయింపులు లభించవచ్చని చాలామంది భావించారు. ఈ సినిమాలో దేశభక్తికి ప్రాధాన్యత ఉండటంతో ఏపీ ప్రభుత్వం
ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వవచ్చని ప్రచారం జరిగింది. అయితే మంత్రి పేర్ని నాని ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏపీలో ఎలాంటి సడలింపులు, మినహాయింపులు ఉండవని తేల్చి చెప్పారు. నిబంధనలు పాటించని థియేటర్లను ఏపీలో మూసివేస్తున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య తనకు ఫోన్ చేశారని పేర్ని నాని వెల్లడించారు. దానయ్య తనతో చెప్పిన విషయాలను కమిటీ ముందు ఉంచుతానని పేర్ని నాని చెప్పుకొచ్చారు. చిరంజీవి జగన్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నారనే అంశం గురించి తన దగ్గర సమాధానం లేదని పేర్ని నాని కామెంట్లు చేశారు.
ప్రభుత్వం మనిషిని బట్టి మారదని నిబంధనలు అందరికీ ఒకటేనని జగన్ సర్కార్ దగ్గర అస్సలు వివక్ష ఉండదని పేర్ని నాని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం బాలయ్య సినిమాకు పన్ను మినహాయింపులు ఇచ్చిందని చిరంజీవి సినిమాకు పన్ను మినహాయింపులు ఇవ్వలేదని పేర్ని నాని వెల్లడించారు. సినిమాసినిమాకు నిబంధనలు మారవని పేర్ని నాని చెప్పుకొచ్చారు. ఏపీ మంత్రి పేర్ని నాని ఆర్ఆర్ఆర్ సినిమాకు భారీ షాక్ ఇచ్చారని చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సినిమా హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసిన ఏపీ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తాయో లేదో చూడాల్సి ఉంది.
మరోవైపు ఢిల్లీలో థియేటర్లను మూసివేస్తూ ఆంక్షలు వెలువడ్డాయి. థియేటర్లపై పూర్తిస్థాయిలో ఆంక్షలు వెలువడితే మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇబ్బందులు తప్పవు. ఆర్ఆర్ఆర్ సినిమా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా 1,000 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!