బిగ్ బాస్ 4: టిక్కెట్ గెలిచినా వేస్టేనా.. ?

బిగ్ బాస్ హౌస్ లో రేసు టు ఫినాలే టాస్క్ లో భాగంగా హోరా హోరీ పోరు నడుస్తోంది. గేమ్ లో నువ్వా నేనా అన్నట్లుగా ఆడుతున్నారు హౌస్ మేట్స్ అందరూ. అయితే, లెవల్ వన్ లో అరియానా, మోనాల్, అవినాష్ ముగ్గురూ కూడా రేస్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక మిగిలిన నలుగురులో రేస్ టు ఫినాలే ఎవరికి దక్కింది అనేది చాలా ఆసక్తికరంగా మారింది.

ఇద్దరు ఫ్రెండ్స్ జోడీలు ఉండటం అనేది మరింత ఆసక్తినిరేపుతోంది. హారిక, అభిజిత్ – సోహైల్ , అఖిల్ వీళ్ల నలుగురులో ఎవరు గెలిచారు అనేది ఉత్కంఠగామారింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం. లాస్ట్ వరకూ సోహైల్ ఇంకా అఖిల్ ఇద్దరూ ఉన్నారని, వీరిద్దరి మద్యలోనే టాస్క్ పెట్టారని చెప్తున్నారు.

ఈ టాస్క్ లో భాగంగా సోహైల్ తో పోటీ పడిన అఖిల్ ఫినాలే టిక్కెట్ ని సొంతం చేస్కున్నాడని, దీంతో టాప్ 5లోకి వెళ్లిన మొట్టమొదటి ఇంటిసభ్యుడు అయ్యాడని అంటున్నారు. అయితే, ఈవారం ఎలిమినేషన్ ప్రోసెస్ ని తప్పించుకుంటేనే టాప్ – 5 లోకి వెళ్లేది. లేదంటేమ మాత్రం వెళ్లేది ఇంటికే. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

నిజానికి ఈవారం నామినేషన్స్ లో లేనిది సోహైల్, అరియానాలు మాత్రమే. లెవల్ 1 లోనే అరియానా అవుట్ అయ్యింది కాబట్టి , సోహైల్ కి ఛాన్స్ ఉంది. కానీ లాస్ట్ మినిట్ వరకూ ఆడిన గేమ్ లో సోహైల్ అఖిల్ తో పోటీ పడి ఓడిపోయారనే న్యూస్ తెలుస్తోంది. మరి సోహైల్ కావాలని అఖిల్ కి శాక్రిఫైజ్ చేసి ఇచ్చాడా..? లేదా అఖిల్ పోరాడి గెలుచుకున్నాడా అనేది ఎపిసోడ్ చూసి తెలుసుకోవాల్సిందే. మొత్తానికి అదీ మేటర్. మరిన్ని ఇంట్రస్టింగ్ బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఫిల్మీ ఫోకస్ కి లాగిన్ అవ్వండి.


బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus