అభిమాన హీరోల పుట్టిన రోజులు వచ్చినప్పుడు… ఫ్యాన్స్ కోసం నిర్మాతలు, దర్శకులు కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్ చేస్తుంటారు. ఇంకొందరు సినిమాల అప్‌డేట్‌లు, టైటిల్, లుక్, టీజర్, ట్రైలర్… ఇలా ఏదో ఒకటి రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది పుట్టిన రోజు సందడిలో కొత్తగా ఓ అంశం యాడ్ అయ్యింది. అదే ట్విటర్ స్పేస్. మొన్నామధ్య జరిగిన మహేష్‌బాబు పుట్టినరోజు వేడుకల నుండి ఈ ట్విటర్ స్పేస్ సందడి స్టార్ట్ అయ్యింది.
ట్విటర్ స్పేస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. వాయిస్ బేస్డ్ సోషల్ మీడియా అని చెప్పొచ్చు. స్పేస్ అంటే గ్రూప్… లింక్ ద్వారా అందులో అందరూ చేరి… తమకు నచ్చిన అంశాలను మాట్లాడుకోవచ్చు. సాధారణంగా ట్విటర్ స్పేస్లో ఏదైనా ఒక అంశాన్ని చెప్పి… దాని గురించి మాట్లాడమంటూ ఉంటారు. స్నేహితులందరూ ఆ పని చేస్తారు. సోషల్ మీడియాను బాగా వాడేయం మొదలుపెట్టిన సినిమా జనాలు హీరోల పుట్టిన రోజు కోసం ప్రత్యేకంగా ట్విటర్ అకౌంట్ క్రియేట్ చేసి స్పేస్ ఏర్పాటు చేస్తున్నారు. అందులోకి చాలామంది వచ్చి… ఆ హీరోతో తమకున్న అనుబంధం గురించి చెబుతున్నారు.
ముందుగా చెప్పుకున్నట్లు మహేష్‌బాబుతో మొదలైన ఈ స్పేస్… తర్వాత చిరంజీవి పుట్టిన రోజు నాడు కూడా పెట్టారు. అయితే నెటిజన్ల తాకిడి ఎక్కువై… ఆ స్పేస్ రెండు, మూడు సార్లు క్రాష్ అయ్యిందని కూడా అంటున్నారు. ఇప్పుడు మరోసారి ట్విటర్ స్పేస్ టైమ్ వచ్చింది. అదే పవన్ కల్యాణ్ బర్త్‌డే. గురువారం పవన్ జన్మదినం సందర్భంగా నిర్మాతలు, దర్శకులు కలసి ట్విటర్ స్పేస్ క్రియేట్ చేయిస్తున్నారట. అందులో పలువురు సెలబ్రిటీలు వచ్చిన మాట్లాడతారట.
మహేష్‌బాబు స్పేస్‌ను ‘సూపర్’ ఫ్యాన్స్ క్రియేట్ చేశారని చెప్పారు. చిరంజీవి స్పేస్‌ను ‘మెగా’ ఫ్యాన్స్ క్రియేట్ చేశారని అన్నారు. ఇప్పుడు ఆటోమేటిక్‌గా పవన్ స్పేస్‌ను ‘పవర్’ ఫ్యాన్స్ క్రియేట్ చేశారని చెబుతారు. అయితే ఎవరు వీళ్లంతా.. అసలు వీటిని ఫ్యాన్సే క్రియేట్ చేస్తున్నారా? అనేది మాత్రం సీక్రెట్. అయితే ఈ ప్రచారం నెటిజన్లకు బోలెడంత సమాచారాన్ని, ఫ్యాన్ వార్ మెటీరియల్‌ని మాత్రం ఇస్తోందనేది సత్యం.