ఇతర భాషా చిత్రాలను తెలుగులో రీమేక్ చేయాలనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. మన తెలుగు సినిమా చరిత్రలో సూపర్ హిట్స్ గా నిలిచిన సినిమాలో సగానికిపైగా రీమేక్సే. వెంకటేష్, పవన్ కళ్యాణ్, నాగార్జున, చిరంజీవి వంటి హీరోలందరూ రీమేకులు చేసినవాళ్లే. అయితే.. ఒకప్పుడు రీమేక్ అంటే తమిళం, హిందీ, మలయాళం లేదా కన్నడ భాషల్లో రూపొంది ఘన విజయం సొంతం చేసుకున్నా సినిమాను తెలుగులో రైట్స్ కొనుక్కొని రీమేక్ చేసేవారు. అప్పట్లో ఆన్ లైన్ సినిమాలు అందుబాటులో లేవు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ.. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక అందరు ప్రేక్షకులు అన్నీ భాషల చిత్రాలను చూసేస్తున్నారు. దాంతో రీమేక్ విషయంలో కాస్త నెమ్మదించారు.
అయితే.. ఈమధ్య ఓ కొత్త ఒరవడి తెలుగు హీరోలు పాటిస్తున్నారు. అదేమిటంటే.. తమిళంలో మాత్రమే కాక తెలుగులో అనువాద రూపంలో విడుదలై సూపర్ హిట్ అయిన చిత్రాలను మళ్ళీ తెలుగులో రీమేక్ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ “కాటమరాయుడు” తెలుగులో “వీరుడొక్కడే”గా విడుదలై.. ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఆ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ మళ్ళీ కాటమరాయుడుగా రీమేక్ చేశాడు. ఇప్పుడు చిరంజీవి కూడా అదే తరహాలో మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా “లూసిఫర్”ను తెలుగు రీమేక్ రైట్స్ కొన్నారట. ఈ రీమేక్ లో చిరంజీవి నటిస్తారా లేదా అనే విషయం తెలియదు కానీ.. చరణ్ మాత్రం రైట్స్ కొనుక్కొన్నాడట. ఆల్రెడీ తెలుగులో విడుదలవ్వడమే కాక అమేజాన్ ప్రైమ్ లో ఎవైలబుల్ గా ఈ సినిమాను ఇప్పుడు కొత్తగా కొనడం ఎందుకా అని తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపడుతున్నారు. మరి చరణ్ ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నాడో చూడాలి.
‘సైరా’ నరసింహారెడ్డి లో ఆకర్షించే అంశాలు ఇవే!
‘బిగ్ బాస్ 3’ హౌస్ మేట్స్ ను సినిమా పోస్టర్లతో పోలిస్తే?