Mahesha Babu: మహేష్ ను ఇలా చూస్తే కన్నీళ్లు ఆగవనే చెప్పాలి.. వీడియో వైరల్..!
- September 28, 2022 / 04:02 PM ISTByFilmy Focus
ఈ ఏడాది సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబంలో రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. ఏడాది ఆరంభంలో ఆయన పెద్ద కొడుకు రమేష్ బాబు మరణించగా.. ఈరోజు ఆయన సతీమణి ఇందిరా దేవి(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆమె ఏ ఐ జి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే బుధవారం సెప్టెంబర్ 28న తుదిశ్వాస విడిచారు. ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది.
కృష్ణ- ఇందిరాదేవిలకు రమేశ్ బాబు, మహేశ్ బాబు.. అమ్మాయిలు పద్మావతి, మంజుల, ప్రియదర్శినితో కలుపుకుని మొత్తం 5 మంది సంతానం. ఇందిరా దేవి మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్ మొత్తం కన్నీటి పర్యంతం అయ్యింది. కృష్ణ- మహేశ్‌బాబులకు తమ సానుభూతి తెలియజేస్తున్నారు ఇండస్ట్రీ పెద్దలు. ఇదిలా ఉండగా… తల్లిని చివరి చూపు చూసుకుంటూ మహేష్ బాబు ఎమోషనల్ కు గురైన వీడియో ఒకటి కన్నీళ్లు పెట్టించే విధంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

చాలా సందర్భాల్లో తన తల్లితో ఉన్న అనుబంధం గురించి మహేష్ చెప్పుకొచ్చాడు.తల్లి చేతి కాఫీ తనకు గుడిలో ప్రసాదంతో సమానం అని భరత్ అనే నేను టైం నుండి చెబుతూనే వచ్చాడు. కన్నతల్లి తన పిల్లలందరినీ సమానంగానే చూస్తుంది కానీ చిన్నోడు అనేసరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మహేష్ పై ఇందిర గారు చూపించిన ప్రేమ కూడా అలాంటిదే..! అందుకే తన తల్లిని చివరి చూపు చూసినప్పుడు మహేష్ చాలా ఎమోషనల్ అయ్యాడు అని ఈ వీడియో చూస్తే స్పష్టమవుతుంది.
Again and Again Saying
Stay Strong @urstrulyMahesh anna 🙏🏻🥺#RIPIndiraDeviGaru #RIPIndirammaGaru pic.twitter.com/XpcauD5ubI— ÐȺÐȺ ✪ (@Egoistsaala2) September 28, 2022
#RIPIndiraDeviGaru pic.twitter.com/elNFn2qeRl
— Phani Kumar (@phanikumar2809) September 28, 2022
కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
















