Ali, Pawan Kalyan: అలీ కోసం పవన్ కళ్యాణ్ వస్తారా..?
- October 30, 2022 / 09:50 PM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో ఉన్న స్నేహితుల్లో కమెడియన్ అలీ ఒకరు. కెరీర్ ఆరంభంలో పవన్ కళ్యాణ్ చేసిన ‘తొలి ప్రేమ’ దగ్గర నుంచి వీరి స్నేహం కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ నటించిన చాలా సినిమాల్లో అలీ కూడా నటించారు. పవన్ స్వయంగా అలీ తనకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అనేది పలు సందర్భాల్లో వెల్లడించారు. అలాంటి స్నేహితుల మధ్య రాజకీయాల పరంగా గ్యాప్ వచ్చింది. పవన్ పెట్టిన ‘జనసేన’ పార్టీలో కాకుండా వైఎస్ఆర్ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు అలీ.
ఆ విషయం పవన్ కు నచ్చలేదు. దీంతో ఓపెన్ గానే అలీ చేసిన పనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి అలీ కూడా ఘాటుగానే బదులిచ్చారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య దూరం ఏర్పడింది. ఇప్పుడిప్పుడే ఇద్దరూ మళ్లీ ఒక్కటవుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అలీ.. పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గా మాట్లాడారు. పవన్ చివరి రెండు సినిమాలు ‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’లలో తాను నటించకపోవడంపై అతడు క్లారిటీ ఇచ్చారు.

అవి రెండూ సీరియస్ సినిమాలని.. వాటిలో కామెడీకి స్కోప్ లేదని అన్నారు. ఆ సినిమాల్లో వేరే ఏ కమెడియన్ కూడా లేకపోవడం గుర్తించాలని అన్నారు. పవన్ తరువాత చేయబోయే సినిమాల్లో కచ్చితంగా నటిస్తానని అన్నారు అలీ. తామిద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని వెల్లడించారు అలీ.

ఇక తను హోస్ట్ చేస్తోన్న ‘అలీతో సరదాగా’ షో పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు అలీ. ఇప్పటివరకు తన ఫ్రెండ్ ని ఈ షోకి తీసుకురాలేకపోయానని.. త్వరలో కచ్చితంగా ఆయనతో ఎపిసోడ్ ఉంటుందని అలీ క్లారిటీ ఇచ్చారు. పవన్ గనుక అలీ షోలో కనిపిస్తే రచ్చ మాములుగా ఉండదు.
జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

















