Prabhas: ఆ స్టార్ డైరెక్టర్ అంటే ప్రభాస్ కు ఇంత అభిమానమా.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ కు ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపు ఉంది. కల్కి 2898 ఏడీ సినిమాతో ప్రభాస్ మరో భారీ హిట్ ను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా వేరే లెవెల్ లో జరుగుతున్నాయి. ఈ సినిమా ఇతర రాష్ట్రాల్లో క్రేజ్ ఉన్న స్టార్స్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోని అందరు దర్శకులు ప్రభాస్ ను ఎంతగానో అభిమానిస్తారు.

అయితే ప్రభాస్ కు ఎంతగానో ఇష్టమైన డైరెక్టర్లలో ప్రభాస్ ఎంతగానో అభిమానించే డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ముందువరసలో ఉంటారని తెలుస్తోంది. ప్రభాస్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలు మరో భారీ స్థాయిలో అయితే సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. గతంలో ప్రభాస్ పూరీ జగన్నాథ్ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

పూరీ జగన్నాథ్ అంటే తనకెంతో అభిమానమని పూరీ జగన్నాథ్ ఆటిట్యూడ్ కు తాను ఫిదా అయ్యానని ప్రభాస్ చెప్పుకొచ్చారు. హీరో పాత్రలను పూరీ జగన్నాథ్ చూపించే విధానం బాగుంటుందని ఆయన కామెంట్లు చేశారు. పూరీ జగన్నాథ్ లో ఏదో మ్యాజిక్ ఉందని ప్రభాస్ వెల్లడించారు. భవిష్యత్తులో ప్రభాస్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.

ప్రభాస్ (Prabhas) ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను వేగంగా పూర్తి చేసి కొత్త సినిమాలను ప్రకటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ వరుస సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ సినిమాలకు బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది. ప్రభాస్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఇండస్ట్రీ హిట్లుగా నిలవాలని అభిమానులు ఫీలవుతున్నారు.

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus