కరోనా వైరస్ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపగా..పెద్ద చిత్రాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందో అర్థం కావడం లేదు. దాదాపు 30 శాతం షూటింగ్ మిగిలివుండగా, రాజమౌళికి ఎలా పూర్తి చేయాలో అంతు పట్టడం లేదు. షూటింగ్స్ కి అనుమతి వచ్చినా కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో షూటింగ్ మొదలుపెట్టడానికి భయపడుతున్నారు.
మరో వైపు బాలీవుడ్ నటులు అలియా భట్, అజయ్ దేవ్ గణ్ ఈ షూటింగ్ లో పాల్గొనే పరిస్థితి కనిపించడం లేదు. ఇక విదేశీ నటుల సంగతి సరేసరి. దీనితో పరిస్థితులు చక్కబడిన వెంటనే ఆర్ ఆర్ ఆర్ నిరవధిక షూటింగ్ జరిపి చిత్రీకరణ పూర్తి చేయాలన్నది ఆయన ఆలోచన. కాబట్టి ఆచార్య మూవీ షూటింగ్ లో చరణ్ పాల్గొనకపోవచ్చు.
అర గంట నిడివి కలిగిన ఆ పాత్ర కోసం దాపు నెలరోజులు చరణ్ ఆచార్య కోసం కేటాయించాల్సి వుంది. ఇది ఇప్పుడు సాధ్యం అయ్యే పనికాదని సమాచారం. దీనిపై ఇప్పటికే రాజమౌళి హింట్ ఇవ్వగా… కొరటాల శివ చరణ్ కి బదులుగా వేరే నటుడిని వెతికే పనిలో ఉన్నారట. కాబట్టి ఆచార్య మూవీ ద్వారా చిరు మరియు చరణ్ ల మల్టీస్టారర్ చూద్దాం అనుకున్న ఫ్యాన్స్ కి నిరాశ తప్పేలా లేదు.