మాస్ మహారాజ రవితేజ ఉత్సాహమే వేరు. విజయం వరించినప్పుడు ఎంత ఉత్సాహంగా పనిచేస్తారో.. అపజయం ఎదురైనప్పుడు అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో నటిస్తారు. టచ్ చేసి చూడు సినిమా ఫలితం తర్వాత నిరాశాపడకుండా ఫుల్ ఎనర్జీ తో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో “నేల టికెట్” సినిమా షూటింగ్ పూర్తి చేశారు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఎస్‌ఆర్‌టీ మూవీస్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 24 న థియేటర్లోకి రానుంది. ఫస్ట్ లుక్, స్టిల్స్, టీజర్ లకు మంచి స్పందన రావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ క్యూ కడుతున్నారు.
అంతకంటే ముందుగానే.. శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. తెలుగు శాటిలైట్ హక్కులు ఎనిమిది కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ దీనికంటే ఎక్కువ ధర పలకడం విశేషం. 12 కోట్లకు హిందీ శాటిలైట్ హక్కులను సన్ టీవీ వాళ్ళు దక్కించుకున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఇందులో నకిలీ డాక్టర్ గా రవితేజ చేసే హంగామా అందరినీ నవ్విస్తుందని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా రిలీజ్ కాకముందే రవితేజ.. శ్రీను వైట్ల దర్శకత్వంలో “అమర్ అక్బర్ ఆంటోనీ” మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు.