‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సూపర్ హిట్ల తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మాస్ మూవీ ‘రెబల్’. రాఘవ లారెన్స్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ‘శ్రీ బాలాజీ సినీ మీడియా’ బ్యానర్ పై జె.భగవాన్, జె.పుల్లారావు…లు దాదాపు రూ.42 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. 2012 సెప్టెంబర్ 28 న రిలీజ్ అయిన ఈ మూవీ ఎవ్వరూ ఊహించని విధంగా పెద్ద ప్లాప్ అయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన తమన్నా, దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటించారు.
ఈ సెప్టెంబర్ 28 కి ‘రెబల్’ రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ వల్ల.. ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ ను అయితే రాబట్టింది. దాదాపు రూ.27 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసింది ఈ సినిమా. అయినా ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. అయితే ‘రెబల్’ వంటి ప్లాప్ నుండి కొంతమంది స్టార్స్ ఎస్కేప్ అయినట్లు తెలుస్తుంది. ముందుగా ఈ సినిమాలో తమన్నా ప్లేస్ లో అనుష్క ని హీరోయిన్ గా అనుకున్నారు.
కానీ లారెన్స్ కు అనుష్క కి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె తప్పుకుంది. అలాగే ముందుగా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహించే ఛాన్స్ బండ్ల గణేష్ కి వచ్చింది. ఎందుకో అతను కూడా తెలివిగా ఎస్కేప్ అయ్యాడు. ఇక సంగీత దర్శకుడిగా తమన్ చేయాలి. కానీ ఎందుకో తమన్ కూడా ఈ ప్రాజెక్టు నుండి మధ్యలో తప్పుకున్నాడు. అలా ఈ ముగ్గురు స్టార్లు ‘రెబల్’ (Rebel Movie) వంటి ప్లాప్ నుండి ఎస్కేప్ అయినట్లు తెలుస్తుంది.